IPL 2022: ఉత్కంఠ రేపిన మ్యాచ్, 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా ఆరంభ రెండు మ్యాచ్‌లను కోల్పోయిన చెన్నై

ఇక ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటిసారిగా తమ ఆరంభ రెండు మ్యాచ్‌లను కోల్పోయింది.

Evin Lewis (Photo credit: Twitter)

రెండు సూపర్‌ పవర్‌ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌దే (LSG vs CSK Stat Highlights, IPL 2022) పైచేయి అయింది. ఇక ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటిసారిగా తమ ఆరంభ రెండు మ్యాచ్‌లను కోల్పోయింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా బౌలింగ్‌ వైఫల్యంతో ఆరు వికెట్ల తేడాతో ఓటమి (Lucknow Super Giants Register Maiden Victory) తప్పలేదు. అటు డికాక్‌ (61), లూయిస్‌ (55 నాటౌట్‌) మెరుపులతో లఖ్‌నవూ గెలుపు బోణీ చేసింది. ఎట్టకేలకు లక్నో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.

తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓడిన లక్నో.. గురువారం జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప (27 బంతుల్లో 50; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో మెరువగా.. శివమ్‌ దూబే (30 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మోయిన్‌ అలీ (22 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు (27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బిష్ణోయ్‌, అవేశ్‌, టైలకు రెండేసి వికెట్లు దక్కాయి.

భారత క్రికెట్‌ దిగ్గజం వినూ మన్కడ్‌ కుమారుడు రాహుల్‌ మన్కడ్‌ మృతి, అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో కన్నుమూత

ఆ తర్వాత ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసి గెలిచింది. చివర్లో హుడా (13), బదోని (19 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ప్రిటోరియ్‌సకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా లూయిస్‌ నిలిచాడు. డికాక్‌ (61; 9 ఫోర్లు), లూయిస్‌ (23 బంతుల్లో 55 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌సెంచరీలు బాదితే.. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. బౌలర్లను సరైన రీతిలో వినియోగించుకోలేకపోయిన చెన్నై సారథి జడేజా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నాడు. లూయిస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో భాగంగా శుక్రవారం కోల్‌కతాతో పంజాబ్‌ తలపడనుంది.