IPL 2023 Naveen Ul Haq: ఓరేయ్ నవీనూ...అవసరమా నీకు.. లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ చేసిన పనికి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్..

దానితో అతను 'స్వీట్ మాంగోస్' అని రాశాడు. RCB, ముంబై మధ్య మ్యాచ్ సందర్భంగా, అభిమానులు నవీన్ చేసిన పోస్టును విరాట్ కోహ్లీతో లింక్ చేస్తున్నారు.

(Photo Credit: Social Media)

ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ నవీన్-ఉల్-హక్ వివాదంలో ఇరుక్కున్నాడు. నవీన్ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. మే 1న ఆర్‌సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో నవీన్-ఉల్-హక్, విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా.. కోహ్లి, నవీన్ ఉల్ హక్ మధ్య ద్వేషం చల్లారలేదు.. ముంబై, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్ ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఇదే విషయం వెల్లడైంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి జట్టు 199 పరుగుల భారీ స్కోరు తర్వాత కూడా ఓడిపోయింది.

RCB  ఓటమిపై, నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో మామిడి ఫోటోను షేర్ చేశాడు.  దానితో అతను 'స్వీట్ మాంగోస్' అని రాశాడు. RCB, ముంబై మధ్య మ్యాచ్ సందర్భంగా, అభిమానులు నవీన్ చేసిన పోస్టును విరాట్ కోహ్లీతో లింక్ చేస్తున్నారు.  RCB ఓటమిని నవీన్ ఆనందిస్తున్నాడని, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎదురుదాడికి దిగుతున్నారు.

అసలు విషయం ఏమిటి

విరాట్, నవీన్ మధ్య ఈ మొత్తం వ్యవహారం మే 1వ తేదీన మొదలైంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో నవీన్-ఉల్-హక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. క్రీజులో ఉన్న అమిత్ మిశ్రా జోక్యం చేసుకుని శాంతించినప్పటికీ, మ్యాచ్ ముగిసే సరికి విషయం మరింత ముదిరింది.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,

మ్యాచ్ ముగిసిన తర్వాత, విరాట్ కోహ్లీ తన లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్‌తో గొడవ పడ్డాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన తర్వాత విరాట్‌ కోహ్లి, నవీన్‌ ఉల్‌ హక్‌ మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.