Neeraj Chopra: తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించిన నీరజ్ చోప్రా, నా కల నేడు నెరవేరింది అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోల్డెన్ బాయ్ ట్వీట్ ఫోటోలు
తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను (Neeraj Chopra Fulfils A Special Dream) నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్ దేవి, సతీశ్ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు.
పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రులు అనుభవించే ఆనందం వేరుగా ఉంటుంది. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా తన తల్లిదండ్రులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఆనందాన్ని అందించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడిని ముద్దాడిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయస్సులోనే ఈ రికార్డు సాధించి, తన ఎదుగులకు ఎంతగానో పాటుపడిన తల్లిదండ్రులు, కోచ్‌లు.. సాయం అందించిన ప్రభుత్వాలకు బంగారు పతకం సాధించడం ద్వారా వారికి మరపురాని గుర్తును అందించాడు.
ఇక నీరజ్ చోప్రా.. తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను (Neeraj Chopra Fulfils A Special Dream) నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్ దేవి, సతీశ్ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శనివారం షేర్ చేసిన నీరజ్.. ‘‘నా కల నేడు (Neeraj Chopra's dream comes true) నెరవేరింది. మొట్టమొదటి సారిగా నా తల్లిదండ్రులు విమాన ప్రయాణం చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక నీరజ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Here's Neeraj Chopra Tweet
‘‘ఈ ఫొటోలను సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరెప్పుడైనా ఒత్తిడికి లోనైనా, నిరుత్సాహానికి గురైనా ఈ ఫొటోలను చూడండి. అన్నీ చిటికెలో మాయమైపోతాయి. నువ్వు సూపర్ నీరజ్ భాయ్. ఈ ప్రపంచంలోని సంతోషమంతా నీ పేరెంట్స్ కళ్లలోనే కనిపిస్తోంది’’ అంటూ ప్రశంసిస్తున్నారు.