Virat Kohli: గౌతమ్‌ గంభీర్‌తో విభేదాలపై బీసీసీఐకి క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ, టీమ్‌పై ప్రభావం చూపవని తేల్చేసిన విరాట్

ఇక హెడ్ కోచ్‌గా నియమితులైన గంభీర్ తనదైన మార్క్ చూపించేందుకు తహతహ లాడుతున్నారు.

virat kohli (Twitter)

July 19:  భారత క్రికెట్ జట్టు హెడ్‌ కోచ్‌గా గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇక హెడ్ కోచ్‌గా నియమితులైన గంభీర్ తనదైన మార్క్ చూపించేందుకు తహతహ లాడుతున్నారు. ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యాని కాదని సూర్యకుమార్ యాదవ్‌ పేరును సూచించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సందర్భంగా గంభీర్ - విరాట్ కోహ్లీ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు జట్టు విజయాలపై ప్రభావం చుపుతాయా అని అటు బీసీసీఐకి ఇటు అభిమానుల్లో సందేహం నెలకొంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐకి క్లారిటీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. గంభీర్‌తో తనకు గతంలో తలెత్తిన విభేదాలు జట్టులో తమ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించవని తేల్చిచెప్పారు. డ్రెస్సింగ్ రూంలో మా వృత్తిపరమైన సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని కోహ్లీ బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నెల 27 నుండి గంభీర్ కోచ్‌గా టీమిండియా 3 టీ-20 మ్యాచ్‌లతో పాటు 3 వన్డేలు ఆడనుంది. తొలుత శ్రీలంకతో సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండరని వార్తలు వచ్చినా వీరిద్దరిని ఎంపిక చేసింది బీసీసీఐ. దీంతో గంభీర్ - విరాట్ మధ్య గతంలో వివాదం నేపథ్యంలో రకరకాల ఉహాగానాలు వినిపిస్తుండగా దీనిపై క్లారిటీ ఇచ్చారు విరాట్. ఆండ్రూ ఫ్లింటాఫ్ వారసుడొచ్చేశాడు, సెంచరీతో అదరగొట్టిన రాకీ ఫ్లింటాఫ్, తొలి ఇంగ్లాండ్ ఆటగాడిగా రికార్డు..వీడియో



సంబంధిత వార్తలు

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

India Women Beat West Indies Women: టీమిండియా జైత్ర‌యాత్ర‌, వెస్టిండిస్ పై ఘ‌న విజ‌యం, 2-1 తేడాతో సిరీస్ కైవ‌సం చేసుకున్న మ‌హిళా జ‌ట్టు

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif