IPL Auction 2025 Live

KKR Vs LSG: ల‌క్నోపై కోల్ క‌తా సునాయాస విజ‌యం, సాల్ట్ మెరుపులు, మిచెల్ స్టార్క్ బౌలింగ్ తో ల‌క్నోపై తొలి విజ‌యం

ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ (KKR) సునాయాస విజయాన్ని సాధించింది.

KKR Vs LSG (PIC@ X)

Kolkata, April 14: బౌలింగ్‌లో స్టార్క్, బ్యాటింగ్‌లో ఫిలిప్ సాల్ట్ చెలరేగడంతో ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders Win) మరో విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ (KKR) సునాయాస విజయాన్ని సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG) విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (Phil Salt) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. సునీల్ నరైన్(6), రఘువంశీ(7) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెన్ డీకాక్(10) తక్కవ స్కోరుకే అవుటకావడం, దీపక్ హుడా(8) విఫలకావడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి మూడో వికెట్ గా అవుటయ్యాడు. పూరన్ మరోసారి జట్టును ఆదుకున్నాడు. 32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయుష్ బదోని 29, స్టోయినిస్ 10 పరుగులు చేశారు.

 

ఐపీఎల్ వేలంలో రూ.24.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కేకేఆర్ దక్కించుకున్న ఆస్ట్రేలియా స్టార్‌ పేస‌ర్ మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc) ఎట్టకేలకు సత్తా చాటాడు. ఈ రోజు మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు.