RCB Vs CSK: ఆర్సీబీ మ్యాచ్ కు వానగండం, 3 ఓవర్లకే నిలిచిపోయిన మ్యాచ్, అప్పటి వరకు స్కోర్ ఎంతంటే?
చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy stadium) జరుగుతున్న సీఎస్కే(CSK), ఆర్సీబీ(RCB) మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. మూడు ఓవర్లు ముగిశాక వాన మొదలైంది
Bangalore, May 18: పదిహేడో సీజన్‌లో కీలక మ్యాచ్‌లకు అడ్డుపడుతున్న వరుణుడు మళ్లీ వచ్చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో (Chinnaswamy stadium) జరుగుతున్న సీఎస్కే(CSK), ఆర్సీబీ(RCB) మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. మూడు ఓవర్లు ముగిశాక వాన మొదలైంది. దాంతో, ఆటగాళ్లంతా డగౌట్‌కు పరుగెత్తారు. 3 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా 31 రన్స్ కొట్టింది. ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే గెలవక తప్పని పోరులో ఆర్సీబీ ఓపెనర్లు ఫాఫ్ డూప్లెసిస్(12), విరాట్ కోహ్లీ(19)లు దంచుతున్నారు. కోహ్లీ అయితే సిక్సర్లతో చెలరేగుతున్నాడు. దాంతో ఆర్సీబీ ఓవర్లకు పరుగులు చేసింది. తుషార్ దేశ్‌పాండే తొలి ఓవర్లో 2 రన్స్ ఇచ్చాడంతే. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కోహ్లీ ఒక ఫోర్, డూప్లెసిస్ ఫోర్, సిక్సర్ బాది బెంగళూరు ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చారు.
బెంగళూరులో మ్యాచ్‌కు వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ ఇంతకు ముందే చెప్పింది. వాన ఎప్పుడు తగ్గినా సబ్ ఎయిర్ సిస్టమ్ ద్వారా ఔట్ ఫీల్డ్‌ను సిద్ధం చేసేందుకు మైదాన సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు 15 పాయింట్లతో చెన్నై దర్జాగా నాకౌట్ పోరుకు దూసుకెళ్తుంది. ఇంకేముంది డూప్లెసిస్ బృందం ఇంటిదారి పడుతుంది.