RCB vs KKR: వరుసగా రెండో మ్యాచ్ లోనూ కోల్ కతా గ్రాండ్ విక్టరీ, ఆర్సీబీపై 7 వికెట్ల తేడాతో విజయం, వృధాగా మారిన కోహ్లీ వన్ మ్యాన్ షో
బెంగళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (50) అర్ధశతకం చేయగా, సునీల్ నరైన్ (47), ఫిలప్ సాల్ట్(30), శ్రేయస్ అయ్యర్(39*) (Shreyas Iyer) రాణించారు.
Bangalore, March 29: ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా వరుసగా (RCB vs KKR) రెండో విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (50) అర్ధశతకం చేయగా, సునీల్ నరైన్ (47), ఫిలప్ సాల్ట్(30), శ్రేయస్ అయ్యర్(39*) (Shreyas Iyer) రాణించారు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
ఓపెనర్ విరాట్ కోహ్లీ (83: 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాటౌట్‌గా నిలిచి బెంగళూరు భారీ స్కోర్ చేయడంతో కీలకంగా వ్యవహరించాడు. గ్రీన్ (33), మాక్స్‌వెల్ (28), దినేశ్ కార్తిక్ (20) విరాట్‌కు సహకరించారు. కోల్‌కతా బౌలర్లలో రాణా, రస్సెల్ తలో రెండు వికెట్లు తీశారు.