Shubman Gill: ఈ చెత్త బ్యాటింగ్‌తో ఇండియా గెలుస్తుందా శుభమాన్ గిల్‌, దారుణంగా ట్రోలో చేస్తున్న క్రికెట్ అభిమానులు,అతన్ని పక్కన బెట్టి రుతురాజ్‌ను తీసుకోవాలని సూచన

గిల్‌కు ప్రత్యామ్నాయంగా రుతురాజ్‌ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఐపీఎల్‌-2023 తర్వాత గిల్‌ గణాంకాలను చూపిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.

Shubman Gill (Photo-Twitter/BCCI)

భవిష్యత్తు భారత సూపర్‌ స్టార్‌గా, జూనియర్‌ విరాట్‌ కోహ్లిగా పేరుగాంచిన టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ను భారత క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్‌ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగి, ఏకంగా 3 సెంచరీలు బాది పరుగుల వరద (17 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 890 పరుగులు) పారించిన గిల్‌.. అంతర్జాతీయ స్థాయిలో దారుణంగా విఫలం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్‌కు ప్రత్యామ్నాయంగా రుతురాజ్‌ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఐపీఎల్‌-2023 తర్వాత గిల్‌ గణాంకాలను చూపిస్తూ సోషల్‌మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ఫైవ్‌లోకి దూసుకువచ్చిన శుభ్‌మాన్ గిల్, టాప్ టెన్‌లోకి ప్రవేశించిన కుల్దీప్ యాదవ్, నంబర్ వన్ స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్

ఐపీఎల్‌ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్‌..నిన్న విండీస్‌తో మూడో టీ20 వరకు టీమిండియా తరఫున 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్ధ సెంచరీ ఉంది. ఐపీఎల్‌ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 31 పరుగులు (13, 18) చేసిన గిల్‌.. ప్రస్తుత విండీస్‌ పర్యటనలో తొలి టెస్ట్‌లో 6, రెండో టెస్ట్‌లో 39 పరుగులు (10, 29 నాటౌట్‌), తొలి వన్డేలో 7, రెండో వన్డేలో 34, మూడో వన్డేలో 85 పరుగులు, తొలి టీ20లో 3, రెండో టీ20లో 7, మూడో టీ20లో 6 పరుగులు చేశాడు.

భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్ అక్టోబర్ 14కు మార్పు, రీ షెడ్యూల్ అయిన మ్యాచుల లిస్టు ఇదే..

ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి అంతర్జాతీయ క్రికెట్లో ఇలా చతికిల పడటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అతనిపై భారీ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.గిల్‌ సరిగా ఆడకపోవడం టీమిండియాపై ప్రభావం చూపుతుందని, పసికూన విండీస్‌ చేతిలో వరుస పరాజయాలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.