Sourav Ganguly Hospitalised: మళ్లీ చాతి నొప్పి, అపోలో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ, జనవరి 2న గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు, త్వరగా కోలుకోవాలని పలువురు ట్వీట్

బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు గురై , కోలుకున్న దాదా (Sourav Ganguly Hospitalised) మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది.

Sourav Ganguly (Photo Credits: Getty Images)

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆయనకు మళ్లీ ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోలకతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల గుండెపోటుకు గురై , కోలుకున్న దాదా (Sourav Ganguly Hospitalised) మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, గంగూలీకి మంగళవారం ఛాతీలో కొంచెం నొప్పిగా అనిపించింది.

కానీ బుధవారం ఆ నొప్పి మరింత పెరగడంతో గ్రీన్ కారిడార్ ద్వారా ముందు జాగ్రత్తగా గంగూలీని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా ఇటీవల (జనవరి, 2) గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ చికిత్స అనంతరం జనవరి 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప గుండెపోటుతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన గంగూలీకి వైద్యులు యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే

ఇదిలా ఉంటే టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కోవిడ్‌ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కరోనా సోకి ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా భయానకం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా తాను కూడా కరోనా వైరస్‌ బారినపడ్డాననీ, కానీ ఆ దేవుడి దయ వల్ల ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ఇన్‌స్టాలోను, ట్విటర్‌లోనూ పోస్ట్‌ చేశారు. తనకి కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ.. అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని సానియా మీర్జా ఇన్‌స్టాలో వెల్లడించారు.

సౌరవ్ గంగూలీకి గుండెపోటు, ఆపరేషన్ చేయాలని సూచించిన వైద్యులు, కలకత్తాలోని ఉడ్‌ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిక

అయినా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లోనే ఉన్నానన్నారు. అయితే ఈ సమయంలో కుటుంబానికి, ముఖ్యంగా తన రెండేళ్ల చిన్నారికి దూరంగా ఉండటం చాలా భయంకరంగా అనిపించిందన్నారు. కానీ కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో ఒంటరిగా, కుటుంబానికి, ఆత్మీయులకు దూరంగా ఉన్న వారి పరిస‍్థితి ఊహించడానికే కష్టం.

ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు..రోజుకో లక్షణం.. రోజుకో కొత్త స్టోరీ... ఇలాంటి అనిశ్చితి పరిస్థితిని డీల్‌ చేయడం అటు శారీరంగానూ, ఇటు మానసికంగానూ చాలా కష్టం. అందుకే కరోనా మహమ్మారిని అసలు జోక్‌గా తీసుకోవద్దు. దీని పట్ల జాగ్రత్తగా ఉందాం. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోడం ద్వారా మిమ్మల్ని మీ వాళ్లను కాపాడుకోండి. మన కుటుంబాన్ని రక్షించుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి. కలిసికట్టుగా ఈ యుద్ధం చేస్తున్నామంటూ సానియా పేర్కొన్నారు.