SRH Retention List for IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే, వదులుకున్న ఆటగాళ్లు లిస్టు ఇదిగో..
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది.
ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (18 కోట్లు), అభిషేక్ శర్మ (14 కోట్లు), నితీశ్‌కుమార్ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (23 కోట్లు), ట్రవిస్ హెడ్ (14 కోట్లు) మరోసారి రిటైన్ చేసుకుంది.
ఫ్రాంచైజీలకు కేవలం ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎస్‌ఆర్‌హెచ్ కొందరు స్టార్ ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, మార్కో జన్సెన్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్ పాట్ కమిన్స్ కంటే హెన్రిచ్ క్లాసెన్‌కు అధిక ధర లభించింది. కాగా టోటల్ పర్స్ వాల్యూ- రూ. 120 కోట్లు. మిగిలిన పర్స్ వాల్యూ- రూ. 45 కోట్లుగా ఉంది.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
పాట్ కమిన్స్- రూ. 18 కోట్లు
అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు
నితీశ్‌కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు
ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు
వదులుకున్న ఆటగాళ్లు
గ్లెన్ ఫిలిప్స్
రాహుల్ త్రిపాఠి
ఎయిడెన్ మార్క్రమ్
మయాంక్ అగర్వాల్
అబ్దుల్ సమద్
అన్మోల్‌ప్రీత్ సింగ్
వాషింగ్టన్ సుందర్
షాబాజ్ అహ్మద్
సన్వీర్ సింగ్
మార్కో జన్సెన్
ఉపేంద్ర యాదవ్
జయదేవ్ ఉనద్కత్
టి నటరాజన్
జఠావేద్ సుబ్రమణ్యన్
మయాంక్ మార్కండే
భువనేశ్వర్ కుమార్
ఫజల్ హక్ ఫారూఖీ
ఆకాశ్ మహారాజ్ సింగ్
ఉమ్రాన్ మాలిక్
విజయ్‌కాంత్ వియాస్‌కాంత్