ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. ప్రస్తుతం రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.
ఐపీఎల్ రిటెన్షన్‌లో అన్ని జట్ల ఆటగాళ్ల జాబితా ఇదిగో, మిగతా ఆటగాళ్లకు నవంబర్ చివరి వారంలో వేలం
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు భారీ ధరకు దక్కించుకున్నాయి. విరాట్ కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.21 కోట్లు వెచ్చించి అట్టిపెట్టుకుంది. అయితే విరాట్ రికార్డును బద్దలు కొడుతూ హెన్రిచ్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఏకంగా రూ.23 కోట్లతో రిటెయిన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్ రిటెయిన్‌లో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా క్లాసెన్ నిలిచాడు. ఇంతకు ముందు రూ.17 కోట్లతో అత్యధిక రిటెన్షన్ ధర పలికిన ఆటగాడి కోహ్లీ ఉండేవాడు. ఆ రికార్డును క్లాసెన్ చెరిపివేశాడు.
రిటెన్షన్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..
1. హెన్రిచ్ క్లాసెన్ (SRH) - రూ.23 కోట్లు
2. విరాట్ కోహ్లీ (RCB) - రూ.21 కోట్లు
3. నికోలస్ పూరన్ (LSG)- రూ.21 కోట్లు
4. పాట్ కమిన్స్ (SRH), సంజు శాంసన్ (RR), యశస్వి జైస్వాల్ (RR), రషీద్ ఖాన్ (GT), జస్ప్రీత్ బుమ్రా (MI), రుతురాజ్ గైక్వాడ్ (CSK), రవీంద్ర జడేజా (CSK) వీళ్లందరినీ ఆయా యాజమాన్యాలు రూ.18 కోట్ల మేర వెచ్చించి అట్టిపెట్టుకున్నాయి.
5. శశాంక్ సింగ్‌ను రూ.5.5 కోట్లకు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను రూ.4 కోట్లకు పంజాబ్ కింగ్స్ రిటెయిన్ చేసుకుంది
6. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు సునీల్ నరైన్, ఆండ్ర్యూ రస్సెల్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిని రిటెయిన్ చేసుకుంది.ఇక రింకూ సింగ్‌కు రూ.13 కోట్లు వెచ్చించింది.