T20 World Cup 2021: ప్రపంచ కప్ మాదే అంటున్న పాకిస్తాన్, మా సంగతేంటి అంటున్న ఇంగ్లండ్, ఐసీసీ షేర్ చేసిన పాక్ అభిమాని పోస్టుకు అదిరిపోయే రిప్లయి ఇచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్
''పాకిస్తాన్ ఈసారి కప్ కొడుతుందని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు... వారి అంచనాలు నిజమవుతాయా'' అంటూ క్యాప్షన్ (ICC post featuring Pakistan fan) జత చేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన ఫోటోపై ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ''మరి ఇంగ్లండ్ '' ("Or England.")అంటూ ఒక్క డైలాగ్‌తో అదిరిపోయే రిప్లై ( Stuart Broad Stunning replies) ఇచ్చాడు.
టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన అన్ని మ్యాచ్ ల్లో (T20 World Cup 2021) భారీ విజయాలను నమోదు చేసింది. గ్రూపులో అగ్రస్థానంలో నిలిచి సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. నాలుగు వరుస విజయాలతో ఐదోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్ 12 గ్రూఫ్-2లో టీమిండియా, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లతో పాటు అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. తాజాగా నమీబియాపై విజయం అందుకున్న పాకిస్తాన్ టైటిల్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్, నమీబియా మ్యాచ్‌కు హాజరైన ఒక పాక్ అభిమాని '' ఈసారి వరల్డ్ కప్ మాదే.. పాకిస్తాన్ జిందాబాద్'' అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు.
ఈ ఫోటోను తాజాగా ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ''పాకిస్తాన్ ఈసారి కప్ కొడుతుందని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు... వారి అంచనాలు నిజమవుతాయా'' అంటూ క్యాప్షన్ (ICC post featuring Pakistan fan) జత చేసింది. అయితే ఐసీసీ షేర్ చేసిన ఫోటోపై ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ''మరి ఇంగ్లండ్ '' ("Or England.")అంటూ ఒక్క డైలాగ్‌తో అదిరిపోయే రిప్లై ( Stuart Broad Stunning replies) ఇచ్చాడు. ఐసీసీ పోస్టును 5 లక్షల మంది లైక్ చేయగా.. అందులో బ్రాడ్ పెట్టిన రిప్లైకి 10 వేలకి పైగా లైక్స్ వచ్చాయి.
Here's ICC Post
ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో పాటు ఇంగ్లండ్ కూడా టైటిల్ ఫెవరెట్‌గా ఉంది. సూపర్ 12 దశలో గ్రూఫ్-1లో ఉన్న ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించి గ్రూఫ్ టాపర్‌గా నిలిచి మెరుగైన రన్‌రేట్‌తో పాక్ కంటే ముందే సెమీస్‌కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ .. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇక సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ మెరుపు సెంచరీతో 26 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అడుగుపెట్టింది.