ICC T20 World Cup 2024: ఆప్ఘన్ల చేతిలో న్యూజీలాండ్‌కు ఘోర పరాభవం, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో 84 పరుగుల తేడాతో ఘన విజయం

గయానా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.

Afghanistan Beat New Zealand

అమెరికాలో జరుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్(T20 Worldcup) క్రికెట్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ సంచ‌ల‌నం సృష్టించింది.న్యూజిలాండ్‌కు ఘోర ప‌రాభ‌వాన్ని రుచి చూపించింది. గయానా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో విఫలమైన కివీస్‌.. అఫ్గాన్‌ ముందు మోకరిల్లింది. టీ20 క్రికెట్‌లో కివీస్‌ను ఆఫ్ఘ‌న్ ఓడించ‌డం ఇదే మొద‌టిసారి.

గ్రూప్ సీలో భాగంగా ప్రావిడెన్స్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ప్ర‌త్య‌ర్థి ఆప్ఘ‌న్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆఫ్ఘ‌న్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 159 ర‌న్స్ చేసింది. గుర్బాజ్‌, ఇబ్ర‌హీంలు తొలి వికెట్‌కు 103 ర‌న్స్ జోడించారు. గుర్బాజ్ 52 బంతుల్లో 80 ర‌న్స్ చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ ఇద్ద‌రూ ఔటైన త‌ర్వాత ఆఫ్ఘ‌న్ బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు.కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌, మాట్‌ హెన్రి తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్‌ ఒక్క వికెట్‌ సాధించారు. బాబోయ్, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఒక్క సెక‌న్ యాడ్‌కు రూ. 4 లక్షలు, హాట్ కేకుల్లా అమ్ముడ‌పోయిన న్యూయార్క్ స్టేడియంలో టికెట్లు

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు అఫ్గానిస్తాన్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. అఫ్గాన్‌ బౌలర్ల దాటికి న్యూజిలాండ్‌ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్‌ పేసర్‌ ఫజల్హక్ ఫారూఖీ, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ తలా నాలుగు వికెట్లు పడగొట్టి బ్లాక్‌ క్యాప్స్‌ పతనాన్ని శాసించారు. వీరితో మహ్మద్‌ నబీ రెండు వికెట్లు సాధించాడు. ఇక న్యూజిలాండ్‌ బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(18), మాట్‌ హెన్రీ(12) డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేయగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.