పొట్టి ప్రపంచకప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం న్యూయార్క్ స్టేడియంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ మధ్యలో ప్రకటనలకు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు భారీగా పైసలు వసూల్ చేస్తున్నాయి. వరల్డ్ కప్‌లో భారత్, పాక్ మ్యాచ్ మధ్య ఒక్క సెకన్ యాడ్‌కు 4,800 డాలర్లు అంటే రూ.4 లక్షలు తీసుకుంటున్నాయట. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి విజయాన్ని నమోదు చేసిన స్కాట్లాండ్, 5 వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు సెకన్‌కు లక్షల్లో సంపాదిస్తున్నాయి. నిరుడు భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లోనూ యాడ్ రెవెన్యూ బోలెడు వచ్చింది. 10 సెకన్ల ప్రకటనకు రూ.30 లక్షలు చార్జ్ చేశారని సమాచారం. వరల్డ్ కప్ చరిత్రలో పాక్‌పై గొప్ప రికార్డు కలిగిన టీమిండియా న్యూయార్క్‌లోనూ విజయంపై కన్నేసింది. తొలి పోరులో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన..ఓటమి బాధలో ఉన్న పాక్‌ను మరింత కుంగదీసేందుకు వ్యూహాలు పన్నుతోంది.