India Vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్ ప్రకటన, తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు, మార్చి 17 నుంచి వన్డే సిరీస్ షురూ..

తొలి వన్డేలో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ తొలి వన్డేలో ఎంపికకు అందుబాటులో ఉండడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే మార్చి 17న జరగనుంది.

Hardik Pandya(Photo credit: Twitter)

ఆస్ట్రేలియాతో (IND vs AUS) జరగనున్న 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌కు భారత్ జట్టును ప్రకటించింది. తొలి వన్డేలో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ తొలి వన్డేలో ఎంపికకు అందుబాటులో ఉండడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే మార్చి 17న జరగనుంది.

చీఫ్ సెలక్టర్ లేకుండా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తొలిసారిగా జట్టును ప్రకటించింది. చేతన్ శర్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశాడు, దీనిని బీసీసీఐ ఆమోదించింది. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే సిరీస్‌లో పునరాగమనం చేశాడు. గాయం నుంచి కోలుకున్న జడేజా ఇటీవలే టెస్టు సిరీస్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు. కంగారూలపై భారత్ 2-0 ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా జట్టులో స్థానం సంపాదించగా, ఆర్ అశ్విన్ అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా  సెలెక్ట్ అయ్యాడు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్

భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లో రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో, మూడో, చివరి వన్డే చెన్నైలో జరగనుంది. మూడు వన్డేలు మధ్యాహ్నం 1:30 నుంచి జరగనున్నాయి.

Vastu Rules For TV: వాస్తు ప్రకారం ఇంట్లో టీవీ ఏ దిక్కులో ఉండాలో తెలుసా ..

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా (విసి), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ చాహల్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ మరియు జయదేవ్ ఉనద్కత్.