Gautam Gambhir: గంభీర్ శాలరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. లంకలో 16 రోజులకు ఎంత తీసుకోనున్నాడంటే?

తనదైన మార్క్‌తో ముందుకుసాగుతున్నాడు గంభీర్. ముఖ్యంగా జట్టు ఎంపికలో బీసీసీఐకి తన ఆలోచన విధానంపై క్లారిటీ ఇస్తున్నారు గంభీర్. ఇప్పటికే కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ ఎంపిక దగ్గరి నుండి టీమ్ కూర్పు వరకు ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు గంభీర్.

Gowtham Gambhir(X)

Sports, July 24: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. తనదైన మార్క్‌తో ముందుకుసాగుతున్నాడు గంభీర్. ముఖ్యంగా జట్టు ఎంపికలో బీసీసీఐకి తన ఆలోచన విధానంపై క్లారిటీ ఇస్తున్నారు గంభీర్. ఇప్పటికే కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ ఎంపిక దగ్గరి నుండి టీమ్ కూర్పు వరకు ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు గంభీర్.

ఇక కోచ్‌గా శ్రీలంక సిరీస్‌ను ఎదుర్కొనున్నారు గంభీర్. ఈ నెల 27 నుండి శ్రీలంతో టీమిండియా టీ20 సిరీస్‌లో తలపడనుండగా ఇందుకోసం గంభీర్ తీసుకుంటున్న సాలరీ తెలిసి అంతా నోరెళ్ల బెడుతున్నారు.

బీసీసీఐ నుండి గౌతం గంభీర్ రూ.12 కోట్లు వేతనంగా అందుకోనున్నారు. అంటే నెలకు అక్షరాల కోటి రూపాయలు. జీతమే కాదు ఇతర సౌకర్యాలు పరిశీలిస్తే ఖంగుతినక తప్పదు. ముఖ్యంగా విదేశీ పర్యటనలలో పొందే రోజువారీ భత్యం రూ. 21000. 22 నుండి ఆగస్టు 7 శ్రీలంకలోనే ఉండనున్నాడు గంభీర్. ఇందుకుగానూ 16 రోజుల మొత్తం అలవెన్స్ రూ.3,36,000లు అందుకోనున్నాడు. అంతేగాకుండా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, మరొకటి ఫైవ్ స్టార్ హోటల్‌లో బస అదనంజ మొత్తంగా గంభీర్‌ కోచ్‌గా తనదైన మార్క్ చూపించనుండగా జీతంకు సంబంధించిన న్యూస్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఆసియా క‌ప్ లో సెమీస్ కు చేరిన‌ టీమిండియా ఉమెన్స్, చివ‌రి లీగ్ మ్యాచ్ లో ఘ‌న‌ విజ‌యం, మెరిసిన షెఫాలి