Virat Kohli Announces Retirement From T20 Cricket: టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ..భారత్ టీ20 ప్రపంచ విజేతగా నిలవగానే కోహ్లీ సంచలన నిర్ణయం..
అయితే T20 అంతర్జాతీయ కెరీర్‌ను వరల్డ్ కప్ ఛాంపియన్ గా ముగించడం విశేషం.
T20 ప్రపంచ కప్ లో విజయం సాధించిన ఆనందంతో పాటు, భారత అభిమానులకు కూడా నిరాశ కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నేడు 76 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో విరాట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ టైటిల్‌ను అంగీకరిస్తూనే కోట్లాది మంది అభిమానుల హృదయాలను బద్దలు కొట్టే మాట చెప్పేశాడు. తన కెరీర్‌లో ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని, భారత్‌కు తాను ఆడే చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అని విరాట్ కోహ్లీ టీ 20 ఇంటర్నేషనల్ కెరీర్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. అయితే T20 అంతర్జాతీయ కెరీర్‌ను వరల్డ్ కప్ ఛాంపియన్ గా ముగించడం విశేషం. కోహ్లీ మొత్తం టోర్నమెంట్‌లో అంతగా రాణించలేదు. పాలయ్యాడు. అయితే ఫైనల్‌లో అతను భారత్‌కు చాలా అవసరమైనప్పుడు 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ తన ఆటలో అగ్రస్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ ఈ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం ఆయన అభిమానులకు గుండె చెదిరే వార్తగా నిలిచింది.