Virat Kohli: రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ, సచిన్‌ టెండూల్కర్‌ ఆల్ టైమ్ రికార్డు బద్దలు, రిక్కీ పాంటింగ్‌ని వెనక్కి నెట్టేసిన పరుగుల సునామి

క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

Virat Kohli (photo-X)

Virat Kohli Breaks Sachin Tendulkar’s Record: వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఓవరాల్‌గా 50వ శతకం సాధించాడు. తద్వారా టీమిండియా లెజెండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌-2023లో భాగంగా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.

దీంతో పాటుగా వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాడిగా విరాట్‌ చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది మెగా టోర్నీలో కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది.

క్రిస్‌గేల్‌ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా కెప్టెన్

వన్డే వరల్డ్‌కప్‌-2003లో సచిన్‌ 7 సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. అంతేకాకుండా వన్డే వరల్డ్‌కప్‌ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌ రికార్డును కూడా కోహ్లి బ్రేక్‌ చేశాడు. విరాట్‌ ఈ టోర్నీలో ఇప్పటివరకు 674* పరుగులు చేశాడు. అంతకుముందు 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ 673 పరుగులు సాధించాడు.

అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌(13704) పేరిట ఉన్న రికార్డు బ్రేక్‌ చేశాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 13751 పరుగులు చేశాడు.

అత్యధిక వన్డే సెంచరీలు:

►50 - విరాట్ కోహ్లి

►49 - సచిన్ టెండూల్కర్

►31 - రోహిత్ శర్మ

►30 - రికీ పాంటింగ్

►28 - సనత్ జయసూర్య