Virat Kohli Gifts Liton Das: కోహ్లీ చేసిన పనికి ఫిదా అవుతున్న క్రికెట్ అభిమానులు, భారత్‌కు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌కు కోహ్లీ గిఫ్ట్, ఇంతకీ ఏం ఇచ్చాడో తెలుసా?

టీం ఇండియాని ఓడించినంత పని చేశాడు. ఈ క్రమంలోనే ఇలా టీమిండియాను భయపెట్టిన లిటన్ దాస్ కూ విరాట్ కోహ్లీ ఒక అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. మేమందరం డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అక్కడికి వచ్చాడు. తన బ్యాట్ ను లిటన్ దాస్ (Virat Kohli Gifts Liton Das) కూ బహుమతిగా ఇచ్చాడు

Adelaide, NOV 04:  విరాట్ కోహ్లీ మరోసారి అభిమానుల మనసు దోచుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్ మాత్రమే కాదు....మంచి మనసులోనూ  నెంబర్ వన్ అని రుజువు చేసుకున్నాడు. అందుకే  కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో సైతం కోహ్లీని(Virat Kohli ) అభిమానించే వారు చాలామంది ఉంటారు. ఇకపోతే విరాట్ కోహ్లీ ఆట తీర్పు మాత్రమే కాదు అతను మైదానంలో దూకుడుగా ఉండే విధానానికి కూడా ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు అని చెప్పాలి. అయితే మైదానంలో మ్యాచ్ ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రత్యర్థి ఆటగాళ్లతో అంతే సరదాగా ఉంటాడు అని చెప్పాలి. ఏకంగా స్నేహితుడి లాగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అందుకే కోహ్లీ (Virat Kohli ) అంటే అభిమానులు తెగ ఇష్టపడుతుంటారు.

T20 World Cup 2022: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం, దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో ఘన విజయం 

ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ చేసిన పని ఏకంగా అభిమానులను ఫీదా అయ్యేలా చేస్తుంది అని చెప్పాలి. ఇటీవల వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ లో భాగంగా ఇండియా, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలోనే బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (Liton Das) ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీం ఇండియాని ఓడించినంత పని చేశాడు. ఈ క్రమంలోనే ఇలా టీమిండియాను భయపెట్టిన లిటన్ దాస్ కూ విరాట్ కోహ్లీ ఒక అరుదైన గిఫ్ట్ ఇచ్చాడు. మేమందరం డైనింగ్ హాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ అక్కడికి వచ్చాడు. తన బ్యాట్ ను లిటన్ దాస్ (Virat Kohli Gifts Liton Das) కూ బహుమతిగా ఇచ్చాడు అంటూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆపరేషన్ చైర్మన్ జలాల్ చెప్పుకొచ్చాడు.

T20 World Cup 2022: మ్యాక్స్‌వెల్ మెరుపులు, ఆప్ఘనిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్న కంగారులు 

ఈ మ్యాచ్‌లో దాస్​.. భారత బౌలర్లను దాస్‌ బెంబేలెత్తించాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 60 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లోనే దాస్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif