MI vs RCB Highlights: ఉత్కంఠ పోరులో శుభారంభం చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, బాల్‌తో పడగొట్టిన హర్షల్ పటేల్, బ్యాట్‌తో నిలబెట్టిన ఏబి డివిలియర్స్

ఎప్పటికప్పుడూ తన బౌలింగ్ లో మార్పులు చేసుకుంటూ 4 ఓవర్లలో ఏకంగా 5 కీలక వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచాడు. ముంబై జట్టులో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పొలార్డ్ మరియు క్రునాల్ పాండ్యా లాంటి మేటి ఆటగాళ్లను తక్కువ స్కోర్లకే హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. అందులోనూ ఒక్క చివరి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టాడు....

Harshal Patel- RCB | (Photo Credits: VIVO IPL 14. Twitter)

Chennai, April 10: వివో ఐపీఎల్ 2021, 14వ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బోణి కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై 2 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.

చెన్నై వేదికగా జరిగిన మొట్ట మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ నిదానంగా మొదలు పెట్టింది. అయితే ముంబై జట్టులో భీకర బ్యాటింగ్ లైనప్, మ్యాచ్‌ను ఒంటి చేత్తో మార్చేయగల హార్డ్ హిట్టర్స్ ఉన్నప్పటికీ బెంగళూరు బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులేమి అంత సులువుగా రాలేదు. కీలక సమయాల్లో ముంబై బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు.

ఇక్కడ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడూ తన బౌలింగ్‌లో మార్పులు చేసుకుంటూ 4 ఓవర్లలో ఏకంగా 5 కీలక వికెట్లు తీసి ముంబై నడ్డి విరిచాడు. ముంబై జట్టులో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పొలార్డ్ మరియు క్రునాల్ పాండ్యా లాంటి మేటి ఆటగాళ్లను తక్కువ స్కోర్లకే హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. అందులోనూ ఒక్క చివరి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇన్నింగ్స్ చివరి 20వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇదే ఓవర్లో 4వ వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. ఫలితంగా 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక 160 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కూడా స్వల్ప లక్ష్యమే అయిన తడబడింది. కోహ్లీ 33, మాక్స్‌వెల్ 39 పరుగులు చేసినా కీలక సమయాల్లో ఔట్ అయ్యారు. అయితే మిస్టర్ 360 ఏబి డివిలియర్స్ మరోసారి తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. 28 బంతుల్లోనే 48 పరుగులు చేసి అటు ఇటుగా ఉన్న మ్యాచ్‌ను బెంగళూరు వైపుకి తిప్పాడు. అయితే మరో 3 బంతుల్లో 3 పరుగులు అవసరమైన సమయంలో డివిలియర్స్ రనౌట్ అవడంతో మళ్లీ బెంగళూరు శిబిరంలో టెన్షన్ మొదలైంది. ఎట్టకేలకు టెయిలెండర్లు 3 సింగిల్స్ తీసి జట్టును గెలిపించటంతో విజయం బెంగళూరు సొంతమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై చివరి వరకు పోరాడి 2 పరుగుల తేడాతో తొలి మ్యాచ్ ఓటమి పాలైంది. ఏ సీజన్‌లోనైనా ముంబై తన తొలి మ్యాచ్ ఓడిపోవటం అనేది ఇక్కడ పునరావృతం చేయడం మరో విశేషం.

స్కోర్లు: ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 159/9 ; బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 20 ఓవర్లకు 160/8.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - హర్షల్ పటేల్.

ఇక, ఈరోజు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif