India Vs Sri Lanka ODI Series: భార‌త్-శ్రీ‌లంక వ‌న్డే సిరీస్ ను ఇలా ఉచితంగా చూసేయండి! జియో సినిమాలో కాదు..ఇక్క‌డ ఉచితంగా స్ట్రీమింగ్, ఇంత‌కీ సిరీస్ ఎప్ప‌టి నుంచి అంటే?

ఇప్పుడు అంద‌రి దృష్టి ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్ పై ప‌డింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌కు (IND Vs SL ODI sreies) సిద్ధం అవుతోంది.

Team India

New Delhi, July 31: శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా (Team India) క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్ పై ప‌డింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌కు (IND Vs SL ODI series) సిద్ధం అవుతోంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ ల‌తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి ఆట‌గాళ్ల రాక‌తో భార‌త జ‌ట్టు బ‌లం పెరిగింది. ఇక హెడ్ కోచ్‌గా తొలి సిరీస్‌తోనే విజ‌యాన్ని అందుకున్న గౌత‌మ్ గంభీర్ వ‌న్డే సిరీస్ పై ఫోక‌స్ పెట్టాడు. వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కి జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ల‌ను మొద‌లు పెట్టాడు. మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌ను సైతం వైట్‌వాష్ చేయాల‌ని టీమ్ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు.

IND vs SL: సూపర్ ఓవర్‌లో సూర్య సేన గెలుపు, కెప్టెన్‌గా తొలి సిరీసే క్లీన్ స్వీప్, బంతితో మ్యాజిక్ చేసిన రింకూ,సూర్య 

స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త్ వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరుకుంది. ఆఖ‌రి మెట్టుపై బోల్తా ప‌డింది. ఫైన‌ల్ మ్యాచ్ త‌రువాత సీనియ‌ర్ ఆట‌గాళ్లు ఆడుతున్న తొలి వ‌న్డే సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు లంక జ‌ట్టు వ‌న్డే సిరీస్‌లో గెలిచి ప‌రువు ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది.

ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ఎక్క‌డంటే..?

భార‌త జ‌ట్టు విదేశాల్లో ఆడే మ్యాచుల‌కు సంబంధించిన హ‌క్కులు అన్నీ సోనీ నెట్‌వ‌ర్క్‌ (Sony Liv) సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు. ఓటీటీలో సోనీ లివ్ లో ప్ర‌సారం అవుతాయి.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

హాట్ స్టార్, జియో సినిమా Jo Cinema) వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో శ్రీలంక వ‌న్డే సిరీస్ రాదు. కేవ‌లం సోనీ లివ్ ఓటీటీలో మాత్ర‌మే చూడొచ్చు. అయితే.. ఇందుకు స‌బ్‌స్ర్కిప్ష‌న్ తీసుకోవాలి. అయితే.. మొబైల్‌లో ఫ్రీగా చూడాల‌నుకుంటే జియోటీవీ యాప్‌లో చూడొచ్చు. జియో టీవీ యాప్‌లో ఛానెల్స్‌లో సోనీ టీవీ నెట్ వ‌ర్క్ ఛానెల్స్‌ను ఎంచుకోని వ‌న్డే సిరీస్‌ను ఉచితంగా చూడొచ్చు.

వ‌న్డే సిరీస్ షెడ్యూల్‌..

తొలి వన్డే – ఆగస్ట్ 2

రెండో వన్డే – ఆగస్ట్ 4

మూడో వన్డే – ఆగస్ట్ 7

భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు మొత్తం కొలంబో వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కానుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif