Hyd, July 31: శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. కోచ్‌గా గంభీర్‌కు, కెప్టెన్‌గా సూర్యకుమార్‌కు ఇది తొలి సిరీస్ కాగా అదరగొట్టింది టీమిండియా. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది టీమిండియా.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఓ దశలో కేవలం 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమిండియా. ఈ దశలో గిల్‌తో కలిసి జట్టు స్కోరు వంద పరుగులు దాటడంలో తనవంతు పాత్ర పోషించాడు రియాన్ పరాగ్. శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో 3 ఫోర్లతో 39 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26 , వాషింగ్టన్ సుందర్ 18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25 పరుగులు చేశారు.
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఓ దశలో గెలుపు ఖాయమనుకున్నారు. కానీ భారత పార్ట్ టైమ్ బౌలర్ రింకూ సింగ్ మ్యాజిక్ చేయడంతో టీమిండియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. చేతిలో 5 వికెట్లు ఉండి 12 బంతుల్లో 9 పరుగులు చేయలేకపోయింది శ్రీలంక. కెప్టెన్ సూర్యకుమార్ రింకూ సింగ్‌కు బౌలింగ్ ఇవ్వగా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు రింకూ. కుశాల్ పెరీరా,రమేశ్ మెండీస్(3)ను పెవిలియన్‌కు పంగా చివరి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌కు దిగాడు.
సూర్య సైతం అద్బుత బౌలింగ్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సూపర్ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ లంక ఓటమిని శాసించాడు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్( 43), కుశాల్ పెరీరా( 46), పాతుమ్ నిస్సంక( 26) పరుగులు చేశారు.
సూపర్ ఓవర్లో సుందర్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో లంక కేవలం 2 పరుగులే చేసింది. తర్వాత తొలి బంతికే సూర్య ఫోర్ కొట్టి లంకపై మూడో టీ20లోనూ విజయాన్ని నమోదు చేశాడు.
Here's Tweet:
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!
Congratulations to the @surya_14kumar-led side on clinching the #SLvIND T20I series 3⃣-0⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/UYBWDRh1op#TeamIndia pic.twitter.com/h8mzFGpxf3
— BCCI (@BCCI) July 30, 2024
#TeamIndia Captain @surya_14kumar led from the front throughout the series and he becomes the Player of the Series 👏👏
Scorecard ▶️ https://t.co/UYBWDRh1op#SLvIND pic.twitter.com/MoReOCXtDH
— BCCI (@BCCI) July 30, 2024
A fine bowling display including a crucial super over!
Washington Sundar becomes the Player of the Match 🙌
Scorecard ▶️ https://t.co/UYBWDRh1op#TeamIndia | #SLvIND | @Sundarwashi5 pic.twitter.com/izY1POE2Di
— BCCI (@BCCI) July 30, 2024