Asia cup 2024: ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళ జట్టు, తొలిసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక
ఫైనల్లో టీమిండియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను చేధించింది శ్రీలంక.
July 28: ఆసియా కప్ విజేతగా నిలిచింది శ్రీలంక మహిళ క్రికెట్ జట్టు. ఫైనల్లో టీమిండియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను చేధించింది శ్రీలంక.
చమరి ఆటపట్టు 61, హర్షిత సమర విక్రమ 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దిల్హారీ 30 పరుగులతో రాణించగా దీప్తీ శర్మ ఒక వికెట్ తీసింది. ఆసియా కప్‌లో అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత మహిళల జట్టు ఫైనల్లో మాత్రం నిరాశ పర్చింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మందాన (60) ,రిచా ఘోష్ (30), రోడ్రిగ్స్ (29) పరుగులు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం