World Cup 2023, SA vs BAN: విజయాల బాట పట్టిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌పై 149 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా విజయం..
బంగ్లాదేశ్‌తో జరిగిన 5వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
నెదర్లాండ్స్‌పై ఓటమి తర్వాత కసితో సౌతాఫ్రికా జట్టు మరోసారి విజయాల బాట పట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన 5వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫామ్‌లో ఉన్న క్వింటన్ డి కాక్ క్రీజులో స్థిరపడి 140 బంతుల్లో 7 ఫోర్లు, 15 ఫోర్ల సాయంతో 174 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సెంచరీ తర్వాత, డి కాక్ ప్రపంచ కప్ 2023లో టాప్ స్కోరర్‌గా అవతరించడం మాత్రమే కాకుండా అనేక రికార్డులను బద్దలు కొట్టాడు.
హెన్రిచ్ క్లాసెన్ తన క్లాస్‌ని ప్రదర్శించి.8 సిక్సర్లు బాది. కేవలం 49 బంతుల్లోనే 90 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. ఈ ఇన్నింగ్స్‌ల కారణంగా ఆ జట్టు బంగ్లాదేశ్‌కు 383 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మెరుపు బ్యాటింగ్ అనంతరం దక్షిణాఫ్రికా బౌలర్లు సైతం బంగ్లాదేశ్ పై సింహాల్లా విరుచుకుపడ్డారు. 100 పరుగుల వ్యవధిలో బంగ్లాదేశ్ జట్టులో సగం మందిని బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. అయితే జట్టు తరఫున మహ్మదుల్లా అద్భుత సెంచరీ చేసినా, జట్టును విజయపథంలో నడిపించడంలో సఫలం కాలేదు. సౌతాఫ్రికా జట్టులో గెరాల్డ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
ఈ భారీ విజయం తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ను దాటేసింది. కివీస్ జట్టు నిరంతరం విజయాలు సాధిస్తున్నప్పటికీ 5వ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా 4 విజయాలతో భారత్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి