Kickboxer Dies: షాకింగ్ వీడియో.. బెంగుళూరులో రింగ్‌లోనే కుప్పకూలిన బాక్సర్, ప్రత్యర్థి విసిరిన పంచ్ వేగంగా తగలడంతో కిందపడిన బాక్సర్, యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్న మృతుని తండ్రి
మ్యాచ్ జరుగుతుండగానే ప్రత్యర్థి ఇచ్చిన పంచ్‌కు కిక్ బాక్సర్ రింగ్‌లోనే (Kickboxer Dies) కుప్పకూలాడు.యువ బాక్సర్ మృతికి మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
బెంగుళూరులో కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగానే ప్రత్యర్థి ఇచ్చిన పంచ్‌కు కిక్ బాక్సర్ రింగ్‌లోనే (Kickboxer Dies) కుప్పకూలి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ యువ బాక్సర్ మృతికి మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన బాక్సర్ 23 ఏళ్ల నిఖిల్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 10న బెంగళూరులోని జ్ఞానజ్యోతి నగర్‌లోని పై ఇంటర్నేషనల్ బిల్డింగ్‌లో స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ (state championship) మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాక్సర్ ప్రత్యర్థి మొహంపై పంచ్ ఇవ్వగానే వేగంగా కిందపడిన నిఖిల్ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. టీ20ల నుంచి విరాట్ కోహ్లీ అవుట్, వెస్టిండీస్‌తో జరిగే సీరిస్‌కు టీంను ప్రకటించిన బీసీసీఐ, రోహిత్‌కే భారత క్రికెట్ పగ్గాలు
వెంటనే అతన్ని నగరబావిలోని జీఎమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే కోమాలోకి వెళ్లిపోయిన నిఖిల్ తలలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడంతో బుధవారం రాత్రి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహించిన ఈవెంట్ ఆర్గనైజర్ నవీన్ రవిశంకర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని.. అతను పరారీలో ఉన్నట్లు సురేశ్ పేర్కొన్నారు. నిఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సెక్షన్ 304-ఏ కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
నిఖిల్ మృతిపై అతని తండ్రి సురేశ్ దీనిపై మాట్లాడుతూ... ప్రత్యర్థి పంచ్ దెబ్బకు నిఖిల్ తలలో బ్లీడింగ్ జరగలేదని.... బాక్సింగ్ రింగ్‌పై ఉన్న మ్యాట్ నాసిరకమని తెలిపాడు. మ్యాట్ కింద కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో మ్యాట్‌పై నిఖిల్ తల బలంగా తాకిందని తెలిపాడు. వెంటనే నిఖిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం నిఖిల్‌ను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కూడా అందుబాటులో లేకపోవడంతోనే నా కొడుకు మృతి చెందాడంటూ'' ఆవేదన వ్యక్తం చేశాడు