వెస్టిండీస్ సీరిస్లో‌  విరాట్ కోహ్లీకి సెలెక్ట‌ర్లు మొండిచేయి చూపారు. వెస్టిండీస్‌తో జ‌రిగే అయిదు టీ20ల‌కు కోహ్లీని ఎంపిక చేయ‌లేదు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌కే ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. స‌ర్జ‌రీతో క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్‌ను టీ20ల‌కు ఎంపిక చేశారు. కానీ చివ‌ర వ‌ర‌కు రాహుల్ ఆడేది లేనిది డౌటే. హార్ధిక్ పాండ్యా, జ‌డేజా, సూర్య‌కుమార్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌లు వెస్టిండీస్ టూర్‌కు సెలెక్ట్ అయ్యారు. జూలై 29వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానున్న‌ది. దానికి ముందు జూలై 22 నుంచి విండీస్‌తో మూడు వ‌న్డేలు ఆడుతుంది. సెలెక్ట‌ర్లు ప్ర‌క‌టించిన బృందంలో కుల్దీప్ యాద‌వ్‌, అశ్విన్‌లు కూడా ఉన్నారు. విండీస్‌తో వ‌న్డేల‌కు ఇప్ప‌టికే జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఆ వ‌న్డేల‌కు రోహిత్, కోహ్లీ, రిష‌బ్‌, బుమ్రాలు దూరంగా ఉండ‌నున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)