Love Proposal at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అంతా చూస్తుండానే తోటి అథ్లెట్ కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన మ‌రో అథ్లెట్, వైర‌ల్ గా మారిన ల‌వ్ స్టోరీ

ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు

Love @ Paris Olympics

Paris, July 28: పారిస్ ఒలింపిక్స్ (Aris Olympics) ఓ ప్రేమజంటకు వేదికగా మారింది. ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్ జూలై 26న ప్రారంభోత్సవం సందర్భంగా అనేక మంది అథ్లెట్లు పారిస్‌లో గుమిగూడారు. ఒక అథ్లెట్ తన తోటి అథ్లెట్‌కు అందరి ముందు ప్రపోజ్ చేసి ఒలింపిక్ గేమ్ ప్రారంభించాడు. ఈ మధురమైన క్షణం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

పాబ్లో సిమోనెట్, పిలార్ కాంపోయ్ మధ్య ప్రేమ కథను @TheOlympicGames అకౌంట్ ద్వారా ట్విట్టర్‌లో జూలై 24న షేర్ చేసింది. పారిస్ 2024 ఒలింపిక్ విలేజ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ పోస్టుకు ప్రపోజల్ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయగా 106.5 వేల వ్యూస్, 665 లైక్‌లు వచ్చాయి. పాబ్లో, పిలార్‌ల లవ్ స్టోరీ.. పారిస్ 2024 ఒలింపిక్స్ చిరస్మరణీయమైన క్షణంగా నిలిచింది. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు లవ్ బర్డ్స్‌ను అభినందించారు. ప్రేమ గాలిలో ఉందని మరో నెటిజన్ కామెంట్ చేయగా, ప్రేమ జంటకు అభినందనలు అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు.

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం 

ఒలింపిక్ రింగ్‌లు, ఎంగేజ్‌మెంట్ రింగ్‌లు ఒకేచోట అంటూ మరో యూజర్ పోస్టు పెట్టాడు. ఈ లవ్ ప్రపోజల్ వీడియోను పాబ్లో సిమోనెట్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేశారు. ఈ అథ్లెట్ జంట 2015 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. 9 ఏళ్ల తమ లవ్ జెర్నీని ప్రపంచమంతా చాటిచెప్పేందుకు ఒలింపిక్స్ వేదిక‌గా బ‌హిర్గంతం చేసింది. ప‌బ్లో మోకాలిపై కూర్చొని పిల‌ర్‌కు ప్రపోజ్‌ చేశాడు. ఆ వెంటనే పిలర్ కూడా ఓకే అనేసింది. అంతే.. ఉంగ‌రం తొడిగేసి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత జ‌ట్టు స‌భ్యుల‌తో ఫొటోలు దిగారు.