Tokyo Olympics 2021 Highlights: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ, 49కిలోల విభాగంలో రజతం సాధించిన మీరాబాయి, కరణం మల్లేశ్వరి తర్వాత పతకం సాధించిన మహిళగా రికార్డు

ఈ ఒలంపిక్స్‌లో 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో (Tokyo Olympics 2020) రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి (Mirabai Chanu) చరిత్ర సృష్టించింది.

Saikhom Mirabai Chanu (Photo Credits: IANS)

టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం (Mirabai Chanu Wins India's First Medal) సాధించింది. ఈ ఒలంపిక్స్‌లో 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో (Tokyo Olympics 2020) రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి (Mirabai Chanu) చరిత్ర సృష్టించింది.

భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు. చైనాకు చెందిన హు జిహు 94 కిలోల బరువు ఎత్తి ఒలింపిక్ రికార్డు సృష్టించారు. ఐదేళ్ల క్రితం మీరాబాయి రియో ఒలింపిక్స్ లో పాల్గొని పేలవమైన ప్రదర్శన ఇచ్చినా, ఆ తర్వాత పుంజుకొని టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి భారత్ కు బోణి కొట్టారు.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో యువ కెరటం సౌరబ్ చౌదరి ఫైనల్ లో ఓడిపోయాడు. ఆరు సిరీస్ ల క్వాలిఫికేషన్ రౌండ్ లో 586 పాయింట్లు సాధించి టాప్ 8లో టాపర్ గా నిలిచి ఫైనల్ లోకి దూసుకెళ్లిన అతడు.. ఫైనల్ లో తడబడి నిష్క్రమించాడు. మొదటి సిరీస్ లో తొలి ఐదు షాట్లకు పదికి పది పాయింట్లు సాధించిన అతడు.. ఆ తర్వాత కొంచెం తడబడ్డాడు. తర్వాతి ఐదు షాట్లకు తొమ్మిది చొప్పున పాయింట్లు సాధించి.. మొత్తం 95 పాయింట్లతో నిలిచాడు. ఆ తర్వాతి సిరీస్ లలో పుంజుకున్న సౌరబ్.. వరుసగా 98, 98, 100, 98, 97 పాయింట్లను సాధించి.. భారత్ కు పతకం ఆశలను మరింత పటిష్ఠం చేశాడు.

మూడో వన్డేలో భారత్ ఓటమి, ఆల్ రౌండ్ షోతో మూడు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా సూర్యకుమార్‌, 2-1తో సీరిస్ భారత్ కైవసం

అయితే, ఫైనల్ లో పోటీ ఇవ్వలేకపోయాడు. ఇదే విభాగంలో అభిషేక్ వర్మ క్వాలిఫికేషన్ రౌండ్​ లోనే వెనుదిరిగాడు. బ్యాడ్మింటన్ లో నిరాశే ఎదురైంది. తెలుగు తేజం సాయి ప్రణీత్ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యాడు. 17–21, 15–21 తేడాతో ఇజ్రాయెల్ క్రీడాకారుడు జిల్బర్ మ్యాన్ చేతిలో ఓడిపోయాడు. ఇటు ఆర్చరీ మిక్స్ డ్ డబుల్స్ లోనూ చేదు ఫలితాలే వచ్చాయి. క్వార్టర్ ఫైనల్స్ లో దీపికా కుమారి, ప్రవీణ్ జాధవ్ ల జోడీ ఓడిపోయింది. కొరియా జంట ఆన్ సాన్ , కిమ్ జే దియోక్ చేతిలో 2–6 తేడాతో ఓటమిపాలయ్యారు.



సంబంధిత వార్తలు

Woman Chops Off Boyfriends Private Parts: పెళ్లికి ఒప్పుకోలేద‌ని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన యువ‌తి, ఆపై చేతిని కోసుకొని ఆత్మ‌హ‌త్య‌, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

New Model Kia Syros Car: మార్కెట్లోకి కియా మ‌రో కొత్త కారు, అదిరిపోయే ఫీచ‌ర్ల‌కు, ఆక‌ట్టుకునే ధ‌ర‌తో తీసుకొస్తున్న కియా

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif