Olympic Games Paris 2024: విశ్వక్రీడా సంబరానికి వేళాయె.. పారిస్‌ కు వెళ్ళొద్దాం.. నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం.. 117 మందితో బరిలో భారత్‌.. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ కు పారిస్‌ ముస్తాబైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌ కు ఆతిథ్యమిస్తున్న పారిస్‌.. ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది.

Olympic Games Paris 2024

Paris, July 26: విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ క్రీడలకు (Olympic Games Paris 2024) పారిస్‌ ముస్తాబైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌ కు ఆతిథ్యమిస్తున్న పారిస్‌.. ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది. కరోనా నిబంధలన నడమ 2020లో జరిగిన టోక్యో (Tokyo)కు పూర్తి భిన్నంగా సీన్‌ నది తీరాన విశ్వక్రీడల మహోత్సవానికి అట్టహాసంగా తెరలేవనుంది. చారిత్రక ఈఫిల్‌ టవర్‌ సాక్షిగా 10,500 మంది ప్లేయర్లు పోటీపడుతున్న ఒలింపిక్స్‌ లో ఆరంభ వేడుకలు నేడు రాత్రి 11 గంటలకు షురూ కానున్నాయి. వివిధ దేశాల ప్లేయర్లకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరిగాయి. చారిత్రక ఈఫిల్‌ టవర్‌ నుంచి సేకరించిన ఇనుముతో పారిస్‌ ఒలింపిక్‌ పతకాలను తయారు చేయడం విశేషం .

భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజు, కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిందే

భారత్‌ పోటీపడే క్రీడాంశాలు

ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, సెయిలింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌, రెజ్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, ఈక్వెస్ట్రియన్‌, గోల్ఫ్‌, హాకీ, జూడో, రోయింగ్‌ తదితర విభాగాల్లో భారత్ నుంచి 117 మంది బరిలో ఉండనున్నారు.

కార్గిల్‌ విజయ్‌ దివాస్‌, దేశం కోసం అమరులైన సైనికులకు ఘన నివాళులు