కార్గిల్ విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని, దేశం కోసం అమరులైన సైనికులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన నివాళులు అర్పించారు. వీరి త్యాగాలు మరువలేనవని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమర వీరుల్ని భారతజాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని రామ్‌నాథ్, మోదీలు కొనియాడారు. అదే విధంగా, భారత్ హోంమంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. అమరులైన సైనికులకు తమ ఘనమైన నివాళులు అర్పించారు. వారు చేసిన ధైర్యసాహాసాలను గుర్తుచేసుకున్నారు.
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపంవద్ద రక్షణ శాఖ సహయ మంత్రి అజయ్ భట్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియా, నేవీ వైస్‌చీఫ్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుధ్దం రక్షణ దళాల శౌర్యం, క్రమశిక్షణకు చిహ్నం అని అన్నారు. కాగా, వారి ధైర్యం, త్యాగానికి సెల్యూట్ తెలిపారు
జూలై 26, 1999లో దాయాది పాకిస్తాన్ మన దేశాన్ని ఆక్రమించాలని.. ఎల్‌ఓసీ వద్ద భారత్ భూభాగంలో ప్రవేశించాయి. ఈ క్రమంలో భారత సైనికులకు, పాక్ ముష్కరులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. అయితే, ఈ యుద్ధంలో భారత భద్రతా దళాలు, పాకిస్తాన్ ముష్కరులను సమర్థవంతంగా ఎదుర్కొని మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
Here's President, PM Tweets
In a message at the Dagger War Memorial at Baramulla, President Kovind paid tributes to the soldiers who laid down their lives defending the nation with indomitable courage and valour. pic.twitter.com/YweORqkf7W
— President of India (@rashtrapatibhvn) July 26, 2021
We remember their sacrifices.
We remember their valour.
Today, on Kargil Vijay Diwas we pay homage to all those who lost their lives in Kargil protecting our nation. Their bravery motivates us every single day.
Also sharing an excerpt from last year’s ’Mann Ki Baat.’ pic.twitter.com/jC42es8OLz
— Narendra Modi (@narendramodi) July 26, 2021
ఈ యుద్ధంలో భారత సైనికులు చాలా మంది మృతి చెందారు. ఈ క్రమంలో.. దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన సైనికులను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్‌ను ఆపరేషన్ విజయ్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.