Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో మరో పతకం దిశగా భారత్, ఆర్చరీలో సెమీస్ కు దూసుకెళ్లిన ధీరజ్, అంకిత జోడీ
చివరి సెట్‌లో చివరి సెట్‌లో ధీరజ్ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ వరుసగా 10, 10 పాయింట్లు సాధించాడు. అంకిత సైతం వరుసగా 9, 8 పాయింట్లతో మెరిసింది.
Paris, AUG 02: పారిస్ ఒలింపిక్స్ (Paris Olymppics) వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన భారత ఆర్చర్లు టీమ్ ఈవెంట్‌లో సత్తా చాటారు. మిక్స్‌డ్ టీమ్ పోటీల్లో బొమ్మదేవర ధీరజ్(Bommadevara Dhiraj), అంకిత భకత్(Ankit Bhakat) జోడీ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన నాలుగు సెట్ల పోరులో స్పెయిన్ జంటపై ధీరజ్, అంకిత ద్వయం 37-36తో గెలుపొందింది. చివరి సెట్‌లో చివరి సెట్‌లో ధీరజ్ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ వరుసగా 10, 10 పాయింట్లు సాధించాడు. అంకిత సైతం వరుసగా 9, 8 పాయింట్లతో మెరిసింది.
స్పెయిన్ ఆర్చర్లలో పాబ్లో 9, 10 పాయింట్లు సాధించగా, ఎలీనా 8, 10తో రాణించింది. దాంతో, భారత జంట 37-36తో స్పెయిన్ ఆర్చరీ జోడీని ఇంటికి పంపింది. ఈ విజయంతో భారత జంట ఒలింపిక్ మెడల్‌కు మరింత చేరువైంది. సెమీస్ బెర్తు కోసం ధీరజ్, అంకితలు వరల్డ్ నంబర్ 1 కొరియా జంటతో తలపడనున్నారు. ఒకవేళ భారత ఆశాకిరణాలు కొరియా ఆర్చర్లకు చెక్ పెడితే చరిత్ర సృష్టిస్తారు.