US Open 2021: 44 ఏళ్ల తర్వాత..యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఎమ్మా రదుకాను, 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ దక్కించుకున్న బ్రిటన్‌ మహిళ

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటిష్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించారు.

Emma Raducanu with the US Open 2021 trophy (Photo credit: Twitter)

New York [US], September 12: యూఎస్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో (US Open 2021) సంచలనం నమోదైంది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటిష్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించారు. ఫలితంగా ఎమ్మా రుదకాను తన కెరియర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్ పోరులో 150వ ర్యాంక్‌లో కొనసాగిన ఎమ్మా రదుకాను.. తనకన్నా మెరుగైన స్థానంలో నిలిచిన 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను ఓడించడం విశేషం.

ఈ విజయంతో ఎమ్మా.. కొత్త రికార్డు సృష్టించారు. 17 ఏళ్ల వయసులోనే గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న క్రీడాకారిణిగా (Emma Raducanu Creates History) ఎమ్మా రికార్డు నెలకొల్పారు. గతంలో క్రీడాకారిణి మారియా షరపోవా కూడా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్‌ టైటిల్‌ దక్కించుకున్నారు. గ్రాండ్ స్లామ్ విజయం సొంతం చేసుకున్న ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ దక్కించుకున్నారు. ఈ ఘన విజయంతో ఎమ్మా ర్యాంకింగ్‌ విషయంలో 150వ స్థానం నుంచి 23వ స్థానానికి చేరుకున్నారు. అంటే ఒక్కసారిగా 127 ర్యాంకులు దాటి ముందుకు వెళ్లారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఎమ్మా రదుకానును బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్- II అభినందనలతో ముంచెత్తారు. 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్న బ్రిటన్‌ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా నెలకొల్పింది. బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందింది.

తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించిన నీరజ్‌ చోప్రా, నా కల నేడు నెరవేరింది అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోల్డెన్‌ బాయ్‌ ట్వీట్ ఫోటోలు

అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మా మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఇక ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు.