CAS Dismissed Vinesh Phogat Petition: వినేశ్ ఫోగట్ పిటిషన్‌ను కొట్టేసిన కాస్ కోర్టు, తీవ్ర నిరాశలో వినేశ్, రజత పతకంపై ఆశలు ఆవిరి
ఒలింపిక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరినా అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టాఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)కు అప్పీల్ చేసింది వినేశ్. కనీసం తనకు రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను దాఖలు చేయగా కాస్ ఈ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో పతకంపై వినేశ్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. న్యాయస్థానం వన్ లైన్‌తో తీర్పు వెల్లడించింది.
Delhi, Aug 15: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరినా అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టాఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)కు అప్పీల్ చేసింది వినేశ్. కనీసం తనకు రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను దాఖలు చేయగా కాస్ ఈ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో పతకంపై వినేశ్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. న్యాయస్థానం వన్ లైన్‌తో తీర్పు వెల్లడించింది.
కాస్ న్యాయస్థానం తీర్పుపై భారత ఒలింపిక్స్ సంఘం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. న్యాయస్థానం వినేశ్ పిటీషన్ కొట్టివేయడం తమకు నిరాశ కలిగిందని తెలిపారు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటీ ఉష. ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోవడంలో కాస్ విఫలమైందని పేర్కొన్నారు. ఈ విషయంలో వినేశ్‌కు పూర్తి మద్దతు ఉంటుందని... న్యాయపరంగా ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. వినేష్ ఫోగట్‌కు తప్పని నిరీక్షణ, తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసిన CAS, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
తొలుత ఆగస్టు 9న విచారణ జరుగగా ఆగస్టు 10లోపు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది కాస్ కోర్టు. ఆ తర్వాత ఆగస్టు 13కి తీర్పును వాయిదా వేయగా తాజాగా మరోసారి 16కు పోస్ట్ పోన్ అయింది. అయితే అంతలోపే తీర్పు వెలువరించింది.
6 పతకాలతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పాయింట్ల పట్టికలో 71వ స్థానంలో నిలవగా అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. చైనా ఈసారి రెండోస్థానంతో సరిపెట్టుకుంది.