Delhi, Aug 14: అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపింక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగం నుండ డిస్ క్వాలిఫై అయింది భారత రెజ్లర్ వినేష్ ఫోగట్. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించగా మరోసారి నిరీక్షణ తప్పలేదు. తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసింది కాస్.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల రెజ్లింగ్‌లో తనకు రజత పతకం ఇవ్వాలని కాస్‌ను ఆశ్రయించింది వివేష్. విచారణలో భాగంగా వినేష్ చేసుకున్న అప్పీల్ సరైనదేనని అభిప్రాయపడిన సాస్ తీర్పును రెండోసారి వాయిదా వేసింది.
తొలుత ఆగస్టు 9న విచారణ జరుగగా ఆగస్టు 10లోపు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 13కి తీర్పును వాయిదా వేయగా తాజాగా మరోసారి 16కు పోస్ట్ పోన్ అయింది. 6 పతకాలతో 71వ స్థానంలో భారత్, టాప్ ప్లేస్‌లో అగ్రరాజ్యం అమెరికా, చైనాకు ఎన్ని పతకాలంటే?
క్రీడల్లో నెలకొనే వివాదాల పరిష్కారం కోసం CASను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వినేష్ తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. అయితే తీర్పు ఎలా ఉన్న రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పినట్లు వినేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలతో పాయింట్ల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. ఒక రజత, 5 కాంస్య పతకాలను సాధించింది భారత్. ఇందులో మను భాకర్ రెండు కాంస్య పతకాలను సాధించి ఔరా అనిపించింది.