Paris, Aug 12: విశ్వక్రీడా సంబరం ఒలింపిక్స్ 2024 ముగిసింది. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో ఈసారి చైనాను వెనక్కి నెట్టి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలతో పాయింట్ల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 1 బంగారు,2 కాంస్య, 2012 లండన్ ఒలింపిక్స్‌లో 2 రజత,నాలుగు కాంస్యం,2016 రియో ఒలింపిక్స్‌లో ఒక రజతం,ఒక కాంస్యం,2020 టోక్యో ఒలింపిక్స్‌లో 1 బంగారు,2 రజత,4 కాంస్య పతకాలు సాధించింది భారత్. ఇక తాజాగా జరిగిన ఒలింపిక్స్‌లో ఒక రజత, 5 కాంస్య పతకాలను సాధించింది భారత్.
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గిన నీరజ్ చోప్రా ఈసారి రజతంతో సరిపెట్టుకోగా మను భాకర్ రెండు కాంస్యాలను సాధించింది. బాక్సింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లలో భారత్ కు నిరాశ మిగిలింది. మహిళల రెజ్లింగ్ లో ఫైనల్ కు చేరిన వినేశ్ ఫోగాట్ ఆ తర్వాత ఎక్కువ వెయిట్ ఉండటంతో అనర్హత వేటుకు గురైంది. అయితే తీర్పు ఆమెకు అనుకూలంగా వస్తుందా లేదా వేచిచూడాలి. భారత అథ్లెట్లు మను బాకర్, నీరజ్ స్పెషల్ చిట్ చాట్.. వీళ్ల మధ్య ఏం జరుగుతుందంటూ ఆసక్తిగా అడుగుతున్న నెటిజన్లు (వీడియోతో)
అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్యాలతో మొత్తం 126 పతకాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా 40 స్వర్ణాలు, 27 రజతాలు, 24 కాంస్యాలతో మొత్తం 91 పతకాలు సాధించి చైనా రెండో స్థానానికి పరమితమైంది.