Maxim Dadashev: ఉసురు తీసిన బాక్సింగ్ ఆట. ప్రత్యర్థి కొట్టిన కొట్టిన దెబ్బలకు తాళలేక ప్రాణాలు విడిచిన యువ బాక్సర్. తల మీద ఆపకుండా తీవ్రంగా కొట్టడంతో నేరుగా కోమాలోకివెళ్లిపోయాడు.
ఇటీవల అలాంటి ఘటన ఒకటి జరిగింది...
Maryland: జూలై 23, 2019 శుక్రవారం రోజున 28 ఏళ్ల రష్యన్ బాక్సర్ మాక్సిమ్ (Maxim Dadashev)దాదాశెవ్ ప్రత్యర్థి సుబ్రిఎల్ మాటియస్ (Subriel Matias) కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
అంతకుముందు జూలై 19, శుక్రవారం రోజున అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, ఎంజిఎం నేషనల్ హార్బర్‌లో బాక్సర్ మాక్సిమ్ vs కరేబియన్ బాక్సర్ సుబ్రిఎల్‌కు మధ్య పోరు జరిగింది. అప్పటికీ బాక్సర్ మాక్సిమ్ వరుసగా 13 విజయాలు సాధించి ఊపు మీద ఉండగా బాక్సర్ సుబ్రిఎల్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే మ్యాచ్‌లో కూడా మాక్సిమ్ గెలుపు లాంఛనమే అని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మాక్సిమ్ దాదాశెవ్ అభిమానులను దిగ్భ్రాంతిలో ముంచేశాడు. అదే మాక్సిమ్‌కి తొలి ఓటమి అవ్వగా, జీవితంలో చివరి ఓటమి కూడా అదే అయింది. ఈ మ్యాచ్‌లో బాక్సర్ సుబ్రిఎల్, మాక్సిమ్ పై బలమైన పంచ్ లతో విరుచుకుపడటంతో అతడి పంచ్ ల ధాటికి మాక్సిమ్ ఆ బాక్సింగ్ రింగ్ లోనే కుప్పకూలిపోయాడు.
ఆరోజు పూర్తి ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్ లో బాక్సర్ సుబ్రిఎల్ తన ప్రత్యర్థి అయిన మాక్సిమ్ పై ధాటిగా, కసిగా విరుచుకుపడుతున్నాడు. ఇటువైపు మాక్సిమ్ తీవ్రంగా గాయపడి రక్తమోడుస్తున్నాడు. ఇది గమనించినఅతడి ట్రైనర్ బడ్డీ మెక్‌గ్రిట్ ఈ పోరును ఆపటానికి వారించంగా మాక్సిమ్ నుంచి ఎలాంటి సంకేతం రాలేదు. దీంతో సుబ్రిఎల్ మరింత రెచ్చిపోయి మాక్సిమ్ తలపై ఆపకుండా బలంగా పంచ్ చేస్తూ పోయాడు. అప్పటికీ మాక్సిమ్ ఓ పక్కఒరిగి పోయి అతడి నుంచి ఎలాంటి స్పందనలు రావడం లేదు, ఇక లాభం లేదనుకొని ట్రైనర్ బడ్డీ మెక్‌గ్రిట్ మాక్సిమ్ ఓటమిని ఖరారు చేస్తూ పోరును నిలిపి వేయించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాక్సింగ్ రింగ్ లో ఉన్నచోటనే మాక్సిమ్ నేలకొరిగాడు.
వెంటనే అతణ్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. సుబ్రిఎల్ కొట్టిన కొట్టుడికి అప్పటికే మాక్సిమ్ తల వాచిపోయింది. అతణ్ని పరీక్షించిన డాక్టర్లు మాక్సిమ్ మెదడుకి తీవ్రగాయాలు అవ్వడం కారణంగా కోమాలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. మాక్సిమ్ ను బ్రతికించేందుకు క్లిష్టమైన సర్జరీ చేశారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. 4 రోజులు మృత్యువుతో పోరాడిన మాక్సిమ్ జూలై 23, మంగళవారం రోజున తుడిశ్వాస విడిచినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఎంతో మంచి కెరియర్ ఉన్న మాక్సిమ్ చిన్నవయసులోనే, అది కూడా అతడు తిరిగులేని విజేతగా రాణించిన క్రీడలోనే ప్రాణాలు కోల్పోవడం, బాక్సింగ్ అసోసిషన్, అతడి అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది.
అయితే బాక్సింగ్ రింగ్ లో పరిస్థితి అంతకు దిగజారి ఒకరి ప్రాణాలు కోల్పోయేంత దూరం వెళ్లడం పట్ల ట్రైనర్ నిర్లక్ష్యం ఉందా ఇంకెవరిదైనా ప్రేరణ ఉందా అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.