Amalapuram Shocker: అమలాపురంలో నడిరోడ్డుపై మహిళను దారుణంగా నరికి హత్య చేసిన దుండుగులు, తీవ్రగాయాల పాలైన మహిళ కొడుకు, పాత కక్షలే కారణమా..,దర్యాప్తు చేపట్టిన అమలాపురం పోలీసులు

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణ ఘటన (Amalapuram Shocker) చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు ఓ మహిళను నడిరోడ్డు మీద దారుణంగా హతమార్చేలా (Woman Brutally Assassination) చేశాయి. ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేయగా తల్లి ఘటనా స్థలంలోనే హత్యకు గురైతే కొడుకు రమేష్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

Image used for representational purpose only. | File Photo

Amalapuram, May 15: ఏపీలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణ ఘటన (Amalapuram Shocker) చోటు చేసుకుంది. రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలు ఓ మహిళను నడిరోడ్డు మీద దారుణంగా హతమార్చేలా (Woman Brutally Assassination) చేశాయి.

ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేయగా తల్లి ఘటనా స్థలంలోనే హత్యకు గురైతే కొడుకు రమేష్‌ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. అమలాపురం రూరల్‌ మండలం (East Godavari District Amalapuram) సమనస గ్రామంలో కొండ్రు కోటేశ్వరరావు, మంగం చిరంజీవి కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల నేపథంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.

అమలాపురం రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు, సమనస గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటేశ్వరరావు, చిరంజీవి కుటుంబాల మధ్య గతం నుంచి వివాదాలు, ఘర్షణలు జరుగుతుండడంతో కక్షలు బాగా బలపడిపోయాయి. ఈ క్రమంలో చిరంజీవి కొడుకు విజయ్‌ సమనస గ్రామంలోనే ప్రత్యర్థి కోటేశ్వరరావుపై మారణాయుధంతో దాడి చేయబోయాడు. కోటేశ్వరరావు కూడా తిరగబడినప్పటికీ అక్కడ నుంచి పరారయ్యాడు.

కరోనా సోకి వెంటిలేటర్‌పై ఉన్న మహిళను వదలని కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేయడంతో 43 ఏళ్ల మహిళ కన్నుమూత, భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఘటన

ఈ సమాచారాన్ని విజయ్‌ తన తండ్రి చిరంజీవికి ఫోన్‌ చేసి కోటేశ్వరరావుపై నేను దాడి చేస్తే పారిపోయాడు. కోటేశ్వరరావు భార్య దుర్గ, కొడుకు రమేష్‌ అమలాపురం నుంచి కొద్దిసేపట్లో బయలుదేరి సమనస వస్తారు. మనం దారి కాసి దాడి చేయాలని చెప్పాడు. దీంతో చిరంజీవి, అతని కొడుకులు విజయ్, నవీన్, చిరంజీవి భార్య బేబి వారికున్న మినీ వ్యాన్‌లో అమలాపురం మారణాయుధాలతో బయలుదేరారు.

ఇదే సమయంలో కోటేశ్వరరావు తన కుమారుడు రమేష్‌కు ఫోన్‌ చేసి.. తల్లి దుర్గను మోటారు సైకిల్‌పై తీసుకురావాలని చెప్పడంతో తల్లీ కొడుకు ఇంటికి బయలు దేరారు. కొండ్రు మంగ అమలాపురం డీఎస్పీ కార్యాలయం వెనక ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో రోజూ సమనస నుంచి పనికి వస్తుంది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం పనిముగించుకుని తన కొడుకు రమేష్‌తో తిరిగి ఇంటికి బయలుదేరింది.

కరోనా తగ్గదనే భయంతో కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య, పురుగుల మందు తాగి బావిలో దూకిన దంపతులు, విజయనగరం జిల్లాలో విషాద ఘటన

ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి కుటుంబం చిరంజీవి, ఆయన కొడుకులు అమలాపురం వచ్చి ఎన్టీఆర్‌ మార్గ్‌పై మారణాయుధాలతో వారిపై దాడి చేశారు. తల్లి దుర్గపై కత్తి వేట్లు ఎక్కువగా పడి అక్కడికక్కడే కుప్పకూలి పోయి రక్తపు మడుగులో ప్రాణాలు వదిలింది. కొడుకు రమేష్‌పై కత్తులతో వేట్లు వేశారు. దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి చిరంజీవి కుటుంబీకులు పరారయ్యారు. అయితే తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను తక్షణమే స్థానికులు కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

అతను అపస్మారక స్థితిలో వైద్యం పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ రమేష్‌ స్పృహలోకి వస్తే ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని సీఐ సురేష్‌బాబు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సమనసలో చిరంజీవి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి సీఐ సురేష్‌బాబు, ఎస్సై దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ వై.మాధవరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement