AP Shocker: ఉన్మాది ఘాతుకం, అందుకు ఒప్పుకోలేదని యువతి గొంతు కోసి చంపేశాడు, చింతల చెరువు గ్రామంలో దారుణ ఘటన, నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు

తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతి (19-year-old college girl ) గొంతు కోసి హత్య చేశాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Amaravati, June 19: కడప జిల్లాలోని బద్వేలు మండలంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతి (19-year-old college girl ) గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మకు 18 ఏళ్ల కూతురు శిరీష ఉంది. ఆమె బద్వేల్ వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొంత కాలంగా కచరణ్ అనే యువకుడు శిరీషను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. ప్రస్తుతం కాలేజీ సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది.

ఈ క్రమంలో చరణ్ శుక్రవారం చింతల చెరువు గ్రామంలోకి వెళ్లి శిరీషను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అక్కడే ఉన్న కత్తితో శిరీష గొంతు (girl hacked to death by stalker) కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శిరీష అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పృహ కోల్పోయిన చరణ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

అయిదుగురి భార్యలతో..,అయినా ఆరవ పెళ్లి కోసం సిద్ధపడుతుండగా పోలీసులకు ఫిర్యాదు చేసిన 5వ భార్య, ఆశ్రమానికి వచ్చే మహిళలను వదలని దొంగ బాబా అనూజ్‌ చేతన్‌ కథేరియా

ఇక కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిపై కత్తి, బండరాళ్లతో దాడిచేశాడు. ఈ ఘటనలో భార్య ప్రియుడు మృతి చెందగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గొనెగండ్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు అనే వ్యక్తి భార్య ఉరుకుందమ్మ గత కొన్నాళ్లుగా బజారీ అనే వ్యాక్తితో సహజీవనం చేస్తోంది.

దీంతో కోపం పెంచుకున్న నాగరాజు వారిద్దరిపై కత్తి, బండరాళ్లతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బజారీ అక్కడికక్కడే మృతి చెందగా, ఉరుకుందమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలులోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు అక్రమ సంబంధమే కారణం అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితుడు నాగరాజు కోసం గాలిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif