Representational Image (Photo Credits: Pixabay)

Lucknow, June 19: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ష‌హ‌నాజ్‌పూర్‌కు చెందిన ఓ దొంగ బాబా ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని మొత్తం అయిదుగురు మ‌హిళ‌ల‌ను వివాహం చేసుకున్నాడు. రహస్యంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఐదుగురిని వివాహం చేసుకోవమే కాక వారికి విడాకులు ఇవ్వకుండానే ప్రస్తుతం ఆరో వివాహాని​కి (Self-proclaimed baba, preparing for sixth marriage) సిద్ధపడ్డ దొంగ బాబాను కాన్పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఆ బాబా బాగోతం బ‌య‌ట‌ప‌డింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. షహనాజ్‌పూర్‌కు చెందిన అనూజ్‌ చేతన్‌ కథేరియా అనే వ్యక్తికి 2005లో మొదటి సారి వివాహం అయ్యింది.పెండ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇదిలా ఉండగానే 2010లో అనూజ్‌ రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత ఆమె కూడా అనూజ్‌ వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత నాలుగేండ్ల‌కు అనూజ్‌ మూడో వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకే మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును నాలుగో వివాహం చేసుకున్నాడు. అయితే, పెండ్లి త‌ర్వాత‌ అనూజ్‌ నిజ స్వరూపం తెలుసుకున్న నాలుగో భార్య ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ది. ఈ క్రమంలో 2019లో అనూజ్‌ ఐదోసారి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత ఐదో భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కండోమ్‌లు ఇస్తాం, అయితే వాడకుండా ఇంటికి తీసుకువెళ్లండి, ఒలంపిక్స్ గేమ్స్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తామని తెలిపిన కమిటీ సీఈవో తోషిరో ముటో

ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్‌ నుంచి వేరుగా ఉండ సాగింది. కొద్ది రోజుల క్రితం అనూజ్ ఆరో పెండ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్‌ని అరెస్ట్‌ చేశారు.

దర్యాప్తులో అనూజ్‌ మ్యాట్రిమోనియల్‌ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. లక్కీ పాండేగా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రెస్‌లు ఇస్తూ.. మహిళలను మోసం చేసేవాడనని వెల్లడించాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్‌, టీచర్‌, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు. అలానే సమస్యలతో తన ఆశ్రమానికి వచ్చే మహిళలను ట్రాప్‌ చేసి లొంగదీసుకునేవాడినని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు.