IPL Auction 2025 Live

CM YS Jagan Review: వైద్య, ఆరోగ్యశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష, ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు

ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను పరిశీలించారు.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, April 12: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) మాట్లాడుతూ... వేల కోట్లను ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాం. విలేజ్‌ / వార్డు క్లినిక్స్‌ దగ్గరనుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట, ముగ్గురికి గాయాలు, 5 రోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం

ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. ఆరోగ్య ఆసరా కింద రోగులకు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు ఇస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచాం. 16 టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నాం. భారీ మార్పులను ఆశించి, దానికి అనుగుణంగా లక్ష్యాలు పెట్టుకున్నామన్నారు. అందుకే విద్య, వైద్య సహా కీలక రంగాలను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాం. అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు అప్పగించామని తెలిపారు.

ఒక ముఖ్యమంత్రిగా నేను లక్ష్యాలను నిర్దేశిస్తాను. కాని, ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలి.శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది ఛాలెంజ్‌గా స్వీకరించాలి. ఆశించిన మార్పుల సాధనకు, లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్‌గా పనిచేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి గణనీయంగా పడిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు కేవలం 5 మాత్రమే ఉన్నాయని, 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేశామని అధికారులు తెలిపారు. 15– 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి వందశాతం 2 డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని, 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నవారికి మొదటి డోసు 94.47 శాతం వ్యాక్సిన్లు వేశామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.