AP Coronavirus Report: ఏపీలో మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు, ఒక్కరోజే 9,211మంది డిశ్చార్జ్, గత 24 గంటల్లో 9,652 మందికి కరోనా, 2820కి చేరుకున్న మరణాల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలు (AP Coronavirus Report) దాటింది. 24 గంటల వ్యవధిలో9652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 306261 కి పెరిగింది. కాగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజు 9,211మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,18,311కి చేరింది. కరనా బారినపడి గడచిన 24 గంటల్లో 88 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2820కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,61,611 పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 85,130 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

Amaravati, August 18: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 లక్షలు (AP Coronavirus Report) దాటింది. 24 గంటల వ్యవధిలో9652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 306261 కి పెరిగింది. కాగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజు 9,211మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 2,18,311కి చేరింది. కరనా బారినపడి గడచిన 24 గంటల్లో 88 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2820కి చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,61,611 పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం 85,130 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

24 గంటల్లో చిత్తూరులో 14, ప్రకాశం 11, అనంతపూర్ 9, గుంటూరు 9, కర్నూలు 9, నెల్లూరు 7, పశ్చిమగోదావరి 6, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 5, విజయనగరం 5, తూర్పుగోదావరి 4, కృష్ణాలో 3, కడపలో ఒకరు కరోనాతో చనిపోయారు. 24 గంటల వ్యవధిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1396 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 990, విశాఖపట్నం 928, గుంటూరు 895, కర్నూలు 830, పశ్చిమ గోదావరి 805, కడప 755, ప్రకాశం 725, నెల్లూరు 684, విజయనగరం 513, అనంతపూర్ 445, శ్రీకాకుళం 405, కృష్ణా 281 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాకు తోడయిన స్వైన్ ఫ్లూ, దేశంలో ఇప్పటివరకు 2,721 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు, తెలంగాణలో 443 కేసులు నమోదు, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా గుంటూరు (306), కర్నూలు (306) జిల్లాల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి (290), చిత్తూరు (257), అనంతపురం (238), కృష్ణా (232), విశాఖపట్నం (216), పశ్చిమ గోదావరి (208), ప్రకాశం (185), శ్రీకాకుళం (176), నెల్లూరు (155), విజయనగరం (126), కడపలో 125 మంది చనిపోయారు.

AP Covid Report

దేశంలో అత్యధికంగా తమిళనాడులో 3778778 కరోనా టెస్టులు చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 3208735 టెస్టులు చేశారు. ఆ తర్వాత మూడోస్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 29,61,611 కరోనా టెస్టులు చేశారు. ప్రతి 10 లక్షల జనాభాకు 55461 కరోనా టెస్టులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో కరోనా పాజిటివ్ రేట్ 10.34 శాతంగా ఉంది. దేశంలో ఈ కరోనా పాజిటివ్ రేట్ 18.83 శాతం మహారాష్ట్రలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ (12.25 శాతం) కర్ణాటక (11.24 శాతం), తమిళనాడులో 9.10శాతం ఉంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now