virus Spread (Photo Credit: IANS)

New Delhi, August 18: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో సరికొత్త వ్యాధులు దానికి తోడయ్యాయి. వైరల్ వ్యాధి కరోనా (Covid-19) దేశంలో ప్రజలకు నిదర లేకుండా చేస్తుంటే దానికి స్వైన్ ఫ్లూ ( Swine flu (H1N1) తోడయింది. ఇవి రెండు దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి జూలై నెలాఖరు వరకు దేశంలో 2,721 స్వైన్ ఫ్లూ కేసులు (swine flu cases) నమోదు కాగా ఈ వ్యాధివల్ల 44 మంది మరణించారు.

జాతీయ రోగ నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) (National Centre for Disease Control (NCDC) గణాంకాల ప్రకారం అత్యధికంగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల టాప్ లిస్ట్‌లో కర్ణాటక (458), తెలంగాణ (443), ఢిల్లీ (412), తమిళనాడు (253), ఉత్తరప్రదేశ్ (252) ఉన్నాయి. శ్వాసకోశ సంబంధ వ్యాధి అయిన స్వైన్ ఫ్లూ తొలుత పందుల నుంచి మనుషులకు వ్యాపించగా, ప్రస్తుతం దగ్గు, చీదడం ద్వారా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు వైద్యనిఫుణులు చెబుతున్నారు. మనిషికి తెలియకుండానే కరోనా వచ్చి..వెళుతోంది, ఏపీలో సీరో సర్వైలెన్స్‌ పరీక్షలో ఆసక్తికర నిజాలు, దేశంలో తాజాగా 55,079 మందికి కరోనా, 27 లక్షలు దాటిన కోవిడ్ కేసులు

సాధారణ ఫ్లూ లక్షణాలైన జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లు నొప్పులు, చలి వంటివి స్వైన్ ఫ్లూలో కూడా ఉంటాయని వారు పేర్కొన్నారు. వృద్ధులు, గర్భిణీ మహిళలు, ఐదు ఏండ్లలోపు పిల్లలు, ఇతర రోగాలున్నవారు స్వైన్ ఫ్లూ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే కరోనా, స్వైన్ ఫ్లూ లక్షణాలు చాలా వరకు ఒకే విధంగా ఉండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యనిఫుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలతో పాటు స్వైన్ ఫ్లూ రోగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించాలని సూచిస్తున్నారు.

శ్వాస సంబంధ రోగాలున్న వారు ముందు జాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా టీకా వేయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కరోనా నియంత్రణ నిబంధనలైన చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం ఎంతో మేలని చెబుతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 26 లక్షలు, మరణాల సంఖ్య 50 వేలు దాటాయి.