Andhra Pradesh Elections 2024: చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంట్, చంద్రబాబు మరో సంచలన ప్రకటన, ప్రజాగళంలో వైసీపీపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన టీడీపీ అధినేత

నగరి,పలమనేరు ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు

Chandrababu (photo/X/TDP)

Nagari, Mar 27: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నగరి,పలమనేరు ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు.ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు.

సీమలో జగన్‌ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదన్నారు. టీడీపీ హయాంలో పలు ప్రాజెక్టులు 90 శాతం పూర్తయితే.. మిగిలిన 10 శాతం కూడా కంప్లీట్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు కృష్ణా జలాలు అందించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రారంభించామని వివరించారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు తామూ సిద్ధమని వ్యాఖ్యానించారు.  సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పగానే వెళ్లిపోయిన జనం, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం, వీడియో ఇదిగో..

మా ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో కరవు సీమలో నీటిపారుదల రంగంలో మార్పులు వచ్చాయి. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద ఎత్తున ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాం. ఐదేళ్లలో రూ.68వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క రాయలసీమలోనే రూ. 12వేల కోట్లు ఖర్చు పెట్టాం. హంద్రీనీవాపై రూ.4,200 కోట్లు ఖర్చు చేయడంతో పనులు పరుగులు పెట్టాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులకు కేవలం రూ.2,165 కోట్లే కేటాయించారు. అవినీతిలో పుట్టిన సాక్షి పత్రికకు మాత్రం ప్రకటనల రూపంలో రూ.వేల కోట్లు ఇస్తున్నారు. ఎక్కడ భూములు కనిపించినా వైసీపీ నేతలు వదల్లేదు. ఆలయ భూములూ విడిచిపెట్టడం లేదు. చివరికి ఇళ్లను కూడా కబ్జా చేసే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. వీడియో ఇదిగో, చంద్రబాబుపై నరసాపురం ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు, నమ్ముకున్నోడికి సీటు ఇప్పించలేదు. మిమ్మల్ని ఎలా నమ్ముతారంటూ..

రాష్ట్రం కోసం బీజేపీతో కలిస్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఐదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ సర్కారు బిల్లులకు జగన్‌ మద్దతిచ్చారు. మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?మేం గతంలో ఎన్డీయేలో ఉన్నప్పుడు మైనారిటీలకు అన్యాయం జరగలేదు. వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ టీడీపీ. రాయలసీమలో జగన్‌ను నిలదీయాలి.’’అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.సీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్‌. రావడానికి వీళ్లేదని ప్రజలు గట్టిగా చెప్పాలి. జనం గెలవాలంటే.. జగన్‌ దిగిపోవాలన్నారు.

పుత్తూరు సభలో చంద్రబాబు : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు అని, బోగస్ సర్వేలు చేయిస్తాడని, అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేయిస్తాడని అన్నారు. పేటీఎం కుక్కల్ని పెట్టుకుని మాపై దాడులు చేయిస్తుంటాడు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు చెప్పడంలో దిట్ట అని పేర్కొన్నారు.

జగన్ కు సిగ్గుంటే, తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వాళ్లను తీసుకెళతాడా? అని ఘాటుగా విమర్శించారు. జగన్ తో పాటు ఇవాళ బస్సులో ఎవరున్నారు... అవినాశ్ రెడ్డి అని చంద్రబాబు వెల్లడించారు. అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ అతడికి ఎంపీ టికెట్ ఇచ్చారు... ఎవరిపై అయినా ఆరోపణలు ఉంటే, అవి తేలాక టికెట్ ఇవ్వాలి కానీ, ఇలా మధ్యలోనే ఇస్తే ప్రజలను అవహేళన చేసినట్టే లెక్క అని చంద్రబాబు వివరించారు. బాబాయినే చంపిన వారికి మీరూ, నేనూ ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు. మొన్నటివరకు కొన్ని సందేహాలు ఉండేవని, ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూశాక గెలుపు మనదే అని ధీమా కలుగుతోందని అన్నారు.

నగరిలో చంద్రబాబు: నగరి ప్రజాగస్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాపై (RK Roja) చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జబర్దస్త్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. మున్సిపాలిటీలో పదవి ఇస్తామని రూ.40 లక్షలు తీసుకున్నారని చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. నగరి నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడికి అడ్డూ అదుపు లేదన్నారు. చివరికీ మట్టిని కూడా వదలడం లేదని చంద్రబాబు (Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నగరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాను ప్రకాష్ ప్రజలు మెచ్చిన నాయకుడని చంద్రబాబు ప్రశంసించారు. ప్రజలు కోరడంతో టికెట్ ఇచ్చానని వివరించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడుని తలపించేలా భాను ప్రకాష్ ప్రజా సేవ చేస్తారని వివరించారు. భానుని ఆ విధంగా తయారు చేస్తానని చంద్రబాబు జనాలకు వివరించారు. దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు భాను ప్రకాశ్ అనే సంగతి తెలిసిందే.

పవర్ రూములకి 400 యూనిట్ల కరెంట్ ఇస్తాం అని చెప్పి సీఎం జగన్ మాట తప్పారని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. పవర్ లూమ్ కార్మికులకు 5 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తామని వివరించారు. నిండ్ర షుగర్ ఫ్యాక్టరీ తిరిగి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నగరిలో పారిశ్రామిక వాడను తీసుకొస్తామని ప్రకటించారు. టెక్స్ టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఉద్యోగం కోసం ఇక్కడి నుంచి చెన్నై వెళ్లే పరిస్థితి ఇకపై ఉండదని చెప్పారు. నగరికి నీళ్లు తీసుకొచ్చే వేణుగోపాల సాగర్ హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. నగరి పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.