Andhra Pradesh Elections 2024: చంద్రబాబు మనిషా శాడిస్టా, పూతలపట్టులో సీఎం జగన్ తీవ్ర విమర్శలు, ఈసీకి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారని మండిపాటు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 7వ రోజు కొనసాగుతోంది. 7వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan Speech in Memantha Siddham Puthalapattu) మాట్లాడారు.
CM Jagan Speech in Memantha Siddham Puthalapattu Public Meeting: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 7వ రోజు కొనసాగుతోంది. 7వ రోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ (CM Jagan Speech in Memantha Siddham Puthalapattu) మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానన్నారు.
ఒకటో తేదీన సూర్యుడు ఉదయించముందే వాలంటీర్లు వచ్చి పెన్షన్లు అందించేవారని, అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా శాడిస్టా అనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయడం ధర్మమేనా? అంటూ ప్రశ్నించారు. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు. జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్తపడాల్సిన సమయం వచ్చింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడండి, మదనపల్లి మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, ఇంటింటికి వెళ్లి ఓటు అడిగే నైతిక హక్కు మనకు మాత్రమే ఉందని వెల్లడి
మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా? (Memantha Siddham). ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్ గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Here's CM Jagan Speech Videos
పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్ డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం. ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం జగన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే 114 మంది అభ్యర్థులు వీరే, శింగనమల నుంచి మాజీ మంత్రి శైలజానాథ్ పోటీ
చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?. వార్డు, సచివాలయాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. రైతు భరోసా కేంద్రాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. ప్రభుత్వ బడులను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. విలేజ్ క్లినిక్‌లను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది ఎవరంటే.. మీ జగన్. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్.. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంది. మే 13న జరగబోయే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి’’ సీఎం జగన్ కోరారు.
పేదలు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలను రక్షించేందుకు సిద్ధమా?. రూ.3వేల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. రైతు భరోసాకు రైతన్నలకు అండగా నిలబడ్డాం. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం. 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమం అందించాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 2014లో రైతు రుణమాఫి చేస్తా అన్నాడు.. చేశాడా?. డ్వాక్రా రుణమాఫి అన్నాడు.. ఒక్క రూపాయి అయినా చేశాడా?. ఆడబిడ్డ పుడితే 25 వేలు డిపాజిట్ చేస్తా అన్నాడు.. చేశాడా?. ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగభతి ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా?. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ కూడా గుర్తురాదు’’ అని సీఎం జగన్ మండిపడ్డారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)