Veera Siva Reddy Joins YSRCP: కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్, వైసీపీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తానని వెల్లడి
గురువారం పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు.
కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీనీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు. ఆ సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైఎస్సార్‌సీపీలో చేరా. పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. వైఎస్సార్‌సీపీ నా సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా సరే. ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తా. చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు. ఏపీలో మళ్లీ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి రావడమే ఖాయం.