AP Intelligence New Chief: ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ కొత్త బాస్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ, అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇంటిలిజెన్స్ చీఫ్ (Intelligence Chief )గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ (Kumar Vishwajit), విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ (PHD Ramakrishna)ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) నియమించింది
Vjy, April 25: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇంటిలిజెన్స్ చీఫ్ (Intelligence Chief )గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ (Kumar Vishwajit), విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ (PHD Ramakrishna)ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లెయిన్స్ రిపోర్టును గురువారం ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు బుదవారం అర్థరాత్రి రాష్ట్ర సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి (Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు.
నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో కుమార్ విశ్వజిత్, పీహెచ్‌డీ రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది.కొత్త నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ... ఈసీ ఈయన్నే నిఘా విభాగాధిపతిగా నియమించింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా నాలుగైదు నెలల పాటు అదే పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా, ఏసీబీ డీజీగా పనిచేశారు. ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరుంది. నిఘా విభాగాధిపతిగా విధులు చేపట్టడం ఇది రెండోసారి. వివేకాకు రెండో భార్య ఉందన్న మాట నిజం కాదా? చంద్రబాబు కుట్రలో షర్మిల, సునిత పావులుగా మారారంటూ తీవ్రంగా ఆరోపించిన వైయస్ జగన్
విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా నియమించిన పీహెచ్‌డీ రామకృష్ణ 2001 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. గతంలో నిఘా విభాగంలోనూ, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఏసీబీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరుంది.