TDP-Janasena's First List: ఇంకా టికెట్ దక్కని టీడీపీ కీలక నేతల లిస్టు ఇదిగో, రెండో జాబితా పైనే గంపెడాశలు, జాక్ పాట్ కొట్టిన కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్
టీడీపీ కీలక నేతలైన గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, కళా వెంకట్రావ్, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరుల పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ - జనసేన కూటమి ఈ రోజు తొలి జాబితాను విదుడల చేసింది. ఈ ఎన్నికల్లో జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోందని అధికారికంగా తెలిసింది. తొలి జాబితాలో భాగంగా చంద్రబాబు 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే ఫస్ట్ లిస్ట్ లో పలువురు టీడీపీ నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ కీలక నేతలైన గంటా శ్రీనివాసరావు, యరపతినేని శ్రీనివాసరావు, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పీతల సుజాత, కళా వెంకట్రావ్, చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, ఆలపాటి రాజా తదితరుల పేర్లు తొలి జాబితాలో కనిపించలేదు. తమ పేర్లు లేకపోవడంతో వీరంతా అసహనానికి గురవుతున్నారు. అయితే, పొత్తుల నేపథ్యంలో వీరి పేర్లను ప్రకటించడం ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. బీజేపీతో క్లారిటీ వచ్చిన తర్వాత వీరి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
ఇక తొలిసారిగా కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలిచారు. కొలికపూడి శ్రీనివాసరావుకు తిరువూరు టికెట్ ఇవ్వగా... పి.గన్నవరం నుంచి మహాసేన రాజేశ్ కు అవకాశం ఇచ్చారు. అమరావతి రాజధాని ఉద్యమాన్ని కొలికపూడి శ్రీనివాసరావు ముందుండి నడిపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఇక సరిపెళ్ల రాజేశ్ కుమార్ అలియాస్ మహాసేన రాజేశ్ తన యూట్యూబ్ చానల్ ద్వారా వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ పాపులర్ అయ్యారు.