MP kesineni Nani on Chandrababu: ఇక నుంచి జగన్‌తోనే నా ప్రయాణం, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు, తనను టీడీపీ నేతలు గొట్టంగాడు అన్న భరించానని ఆవేదన

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మండిపడ్డారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టినట్లు తెలిపారు.

MP kesineni Nani (Photo-Video Grab)

Vjy, Jan 10: విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి విదితమే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మండిపడ్డారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టినట్లు తెలిపారు.

టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించా. నా రాజీనామా అమోదం పొందగానే వైఎస్సార్‌సీపీలో చేరుతా. విజయవాడ అంటే ప్రాణం ఏమైనా చేస్తా. 2014 నుచి 2019 వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూ. 100 కోట్లైనా ఇచ్చాడా. విజయవాడ కోసం నేను చేశా. షాజహాన్‌ తాజ్‌మహాల్‌ కట్టాడు, నేను అమరావతి కడతానని బాబు గొప్పలు చేశారు. విజయవాడ ఒక రియాలిటీ, అమరావతి ఒక కల. నేను బాబును ఎప్పుడూ టికెట్‌ అడగలేదు.. ఇప్పుడు సీఎం జగన్‌ను కూడా అడగను. ఇప్పుడు జగన్‌తో ప్రయాణం చేయాలనుకుంటున్నా. ఎన్టీఆర్‌ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవబోతుంది.’ అని చెప్పారు.

సీఎం జగన్‌‌తో ముగిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ, కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు

సొంత వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యమని పని చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారాలు వదులుకున్నానని అన్నారు. బాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోశానని, పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డానని తెలిపారు. టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్‌ పెట్టించి తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెప్పుతీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్‌ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందిచలేదని వాపోయారు. తనను గొట్టంగాడు అన్న భరించానని ఆయన పేర్కొన్నారు.

విజయవాడ మేయర్‌గా అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబాబే నిర్ణయించారని.. ఆయన మూడు రోజులు అడిగితేనే శ్వేత ముందుకొచ్చిందని తెలిపారు. ఆ తర్వాతే ప్రెస్‌మీట్‌ పెట్టించి తనను బాబు తిట్టించారని గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలే తనను అవమానించినా పార్టీ చర్యలు తీసుకోలేదు. నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పార్టీ నుంచి కనీస మద్దతురాలేదు. నన్ను చాలా రకాలుగా అవమానించారు. టీడీపీలో ఉంటూ ఇంకా ఎన్ని భరించాలి. ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని అప్పుడే చంద్రబాబుతో చెప్పాను. వద్దు నువ్వు ఉండాల్సిందే అని బాబు నాతో చెప్పారు.

విజయవాడలో టీడీపీకీ మరో షాక్, కార్పొరేటర్ పదవికి, టీడీపీకి గుడ్‌బై చెప్పిన కేశినేని శ్వేత

టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలామందే చెప్పారు. చాలా మంది చెప్పినా కూడా నేను టీడీపీలోనే కొనసాగాను. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు. నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్‌ ఎందుకు చూశాడు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు. మరీ ఇంత పచ్చిమోసగాడు, దగా చేస్తాడని తెలీదు. ఎంపీగా సీఎం కార్యక్రమాలకు నేను అటెండ్‌ కావాలి అది ప్రోటోకాల్‌. నా విషయంలో టీడీపీ ప్రొటోకాల్‌ మరిచిపోయింది. సీఎం కార్యక్రమాలకు బాబు నన్ను హాజరు కానివ్వలేదు. చంద్రబాబు ఏపీకి పనికీ రాని వ్యక్తి అని మండిపడ్డారు.

 



సంబంధిత వార్తలు

Bank Holidays in December 2024: డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఇదిగో, ఈ నెలలో పనిచేసేది కొన్ని రోజులే కాబట్టి అలర్ట్ కాక తప్పదు

Telangana Diksha Divas: తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు.. దీక్షా దివస్, కేసీఆర్ చచ్చుడో - తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో ఆమరణ దీక్ష..రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు

Cyclone Fengal Alert: మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్, ఏపీలో మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడు తీర ప్రాంతాలకు పెను ముప్పు

Jalaun Horror: యూపీలో దారుణం, మహిళ ప్రైవేట్ భాగాల్లో కర్రను చొప్పిస్తూ సామూహిక అత్యాచారం, తర్వాత కారం పోసి కామాంధులు పైశాచికానందం