Andhra Pradesh Elections 2024: ఏపీలో సాయంత్రం 5 గంటలకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇదిగో, లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే..
ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) కోసం ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల కోసం ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల పోలింగ్ పై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 6.00 గంటల కల్లా క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఏపీ ఎన్నికల పోలింగ్‌పై ఈసీ కీలక ప్రకటన, ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడి, సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓటింగ్ నమోదు
పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించాం. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించాం. పల్నాడు, అనంతపురం, తెనాలిలో కొందరిని గృహ నిర్బంధం చేశారు’’ అని ఏపీ సీఈవో వెల్లడించారు. కాగా, సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో 67.99 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం... (సాయంత్రం 5 గంటల సమయానికి)
1. శ్రీకాకుళం- 67.48
2. విజయనగరం- 68.16
3. పార్వతీపురం మన్యం- 61.18
4. విశాఖ- 57.42
5. అల్లూరి సీతారామరాజు- 55.17
6. అనకాపల్లి- 65.97
7. కాకినాడ- 65.01
8. కోనసీమ- 73.55
9. తూర్పు గోదావరి- 67.93
10. పశ్చిమ గోదావరి- 68.98
11. ఏలూరు- 71.10
12. కృష్ణా- 73.53
13. ఎన్టీఆర్- 67.44
14. గుంటూరు- 65.58
15. పల్నాడు- 69.10
16. బాపట్ల- 72.14
17. ప్రకాశం- 71.00
18. నెల్లూరు- 69.95
19. తిరుపతి- 65.88
20. చిత్తూరు- 74.06
21. అన్నమయ్య- 67.63
22. వైఎస్సార్ కడప- 72.85
23. నంద్యాల- 71.43
24. కర్నూలు- 64.55
25. అనంతపురం-68.04
26. శ్రీ సత్యసాయి- 67.16
లోక్ సభ స్థానాల వారీగా పోలింగ్ శాతం వివరాలు... (సాయంత్రం 5 గంటల సమయానికి)
1. కాకినాడ- 65.01
2. అమలాపురం- 73.55
3. రాజమండ్రి- 67.93
4. నరసాపురం- 68.98
5. ఏలూరు- 71.10
6. శ్రీకాకుళం- 67.10
7. విజయనగరం- 67.74
8. అరకు- 58.20
9. విశాఖ- 59.39
10. అనకాపల్లి- 64.14
11. మచిలీపట్నం- 73.53
12. విజయవాడ- 67.44
13. గుంటూరు- 65.58
14. నరసరావుపేట- 69.10
15. బాపట్ల- 72.57
16. ఒంగోలు- 70.44
17. నెల్లూరు- 69.55
18. తిరుపతి- 65.91
19. చిత్తూరు- 75.60
20. రాజంపేట- 68.47
21. కడప- 72.85
22. కర్నూలు- 64.08
23. నంద్యాల- 70.58
24. హిందూపురం- 66.89
25. అనంతపురం- 67.71