YSR Rythu Bharosa-PM Kisan: రైతుల అకౌంట్లోకి నేరుగా రూ.7,500, నేడు సీఎం చేతుల మీదుగా వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం ప్రారంభం, తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.2800 కోట్లు జమ

తొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ కానుంది. ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 నేరుగా అకౌంట్లో వేయనున్నారు. ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయంగా అందనుంది.ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు ఏపీ సీఎం సాయం చేయనున్నారు.

Image used for representational purpose. | (Photo-PTI)

Amaravati, May 15: వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం (YSR Rythu Bharosa-PM Kisan scheme) ద్వారా అన్నదాతల ఖాతాల్లో నగదు నేరుగా జమ కానుంది. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS YS Jagan Mohan Reddy) నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా, స్కీం అమలుకోసం రూ.5వేల 510 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన తొమ్మిది వాగ్దానాలలో (నవరత్నాలూ) రైతు భరోసా ఒకటి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు వాయిదాల్లో 6,534 కోట్ల రూపాయలను రైతు భరోసా-పిఎం కిసాన్ (YSR Rythu Bharosa-PM Kisan) పథకానికి ఖర్చు చేయనుంది.

తొలివిడతగా నేడు రైతుల ఖాతాల్లోకి రూ.2,800 కోట్లు జమ కానుంది. ప్రతి రైతు కుటుంబానికి తొలివిడతగా రూ.7,500 నేరుగా అకౌంట్లో వేయనున్నారు. ఈసారి 49.43 లక్ష కుటుంబాలకు పెట్టుబడి సాయంగా అందనుంది.ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు ఏపీ సీఎం సాయం చేయనున్నారు.

గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికం. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. రైతుల ఖాతాల్లోకి పీఎం సమ్మాన్ యోజన నిధులు జమ, ఆంధ్ర ప్రదేశ్‌లో గత రుణమాఫీ ఉత్తర్వులు రద్దు

2019–20 రబీ సీజన్‌ నుంచి ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం అమల్లోకి తెచ్చింది. గత ఏడాది రబీలో ఈ పథకం ద్వారా 46.69 లక్షల రైతు కుటుంబాలకు సాయం అందింది. ప్రస్తుత ఖరీఫ్‌లో లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 49,43,590కి పెరిగింది.

ఇందులో రైతు భరోసా జనరల్‌ ఖాతాలు 46,28,767 కాగా చనిపోయిన కుటుంబాల నామినీలు 61,555 మంది, అన్‌ సీడెడ్‌ వెబ్‌ల్యాండ్‌ ఖాతాలు 1,58,949, అన్‌సీడెడ్‌ నాన్‌ వెబ్‌ ల్యాండ్‌ ఖాతాలు 53,076, ఎండోమెంట్‌ భూముల సాగుదారులు 623 మంది, అటవీ భూములను సాగు చేసుకుంటున్న కౌలుదారులు 40,620 మంది ఉన్నారు.

ఇది మూడు విడతలుగా మే 15 వరకు రూ .7,500, అక్టోబర్‌లో రూ .4,000, సంక్రాంతికి రూ .2,000 అందనున్నాయి. రైతులకు మూడు దశల్లో సంవత్సరానికి 13,500 రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది. డేటా బేస్‌ ఆధారంగా అర్హులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాదికి ప్రస్తుతం తొలి విడతలో రూ.7,500 చొప్పున రూ.3,675 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతుంది. ఏపీ కౌలు రైతులకు శుభవార్త, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం, జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు కూడా రూ.13,500 సాయం అందుతుంది. ఈ వర్గాలకు చెందిన కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది. 18వ తేదీ నుంచి విత్తనాల విక్రయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులు కరోనా విపత్తుతో ఇబ్బంది పడకుండా 15 నుంచే నగదు జమను ప్రారంభిస్తున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఈ ఏడాదిలో తొలి విడత సాయం అందించేందుకుగాను ప్రస్తుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుంచి అదనంగా మరో రూ.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. కాగా, బుధవారం రూ.409.47కోట్లను విడుదల చేసిన సంగతి తెలసిందే. అలాగే, వర్షాధారిత ప్రాంత అభివృద్ధికి కూడా నిధులు విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్‌లో రైతుల ఖాతాల్లోకి రూ .2,000 జమ చేసింది, కాబట్టి మిగిలిన రూ .5,500 శుక్రవారం బదిలీ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి మరియు మైనారిటీలకు చెందిన కౌలుదారు రైతులకు మరియు వ్యవసాయ ఎండోమెంట్ మరియు అటవీ భూములకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement